తమన్నా హాట్ ఫొటో షూట్(కొత్త ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ :తెలుగునాట స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన అనుభవం తమన్నా సొంతం. బాలీవుడ్‌లోనూ జెండా ఎగరేయాలని చూసింది. తమిళంలోనూ విజయాల్ని సొంతం చేసుకొంది. వరస ఆఫర్స్ తో పూర్తి బిజీగా ఉన్న ఈ సమయంలోనూ తను లేటెస్ట్ ఫొటో షూట్ తో ఆకట్టుకోవాలని చూస్తోంది.

'బాహుబలి' తరవాత తమన్నా అధికారికంగా ఒప్పుకొన్న సినిమా ఒక్కటీ లేదు. రవితేజతో నటించడానికి సిద్ధమైనా ఆ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉంది.

తమన్నా మాట్లాడుతూ...''నా విజయాలకు కారణం.... నా ఆసక్తే. చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. ప్రతి రోజూ ఏదో ఓ సినిమా చూసేదాన్ని. ఆ సినిమాలో హీరోయిన్ చెప్పిన డైలాగుల్ని బట్టీపట్టి వల్లించేదాన్ని. నేనే ఆ పాత్ర చేస్తే ఎలా ఉంటుందో వూహించుకొనేదాన్ని. ఈ వూహల మధ్యే పెరిగా.

ఆ ఆసక్తి సినిమా రంగంలో అడుగుపెట్టడానికి, ఇక్కడ నాకంటూ ఓ స్థానం సంపాదించడానికి ఉయోగపడింది. మనల్ని నిరుత్సాహపరచడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అవేం పట్టించుకోవద్దు.. మీరు నమ్మిన బాటలో నడవండి. విజయం తప్పకుండా వరిస్తుంది'' అంటూ చెప్పుకొచ్చింది.

తప్పు ఒప్పులు ఎంచండి..

తప్పు ఒప్పులు ఎంచండి..

''ఏదైనా ఓ రంగంపై ఇష్టం పెంచుకోండి. ప్రేమతో అధ్యయనం చేయండి. తెలివితో తప్పొప్పులను ఎంచండి. అవే మిమ్మల్ని ఆ రంగంలో విజేతలుగా నిలుపుతాయి..'' అంటోంది తమన్నా.

ఎంపిక

ఎంపిక

తొలి నుంచీ తమన్నా తనదైన శైలిలో పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. కమర్షియల్ చిత్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అదే ఆమెను ఉన్నత స్ధాయిలో నిలబెట్టింది.

హోమ్లి ఆయినా...

హోమ్లి ఆయినా...

తమన్నా అంటే హోమ్లీ పాత్రలు, కొద్దిగా చిలిపితనం ఉన్న క్యారెక్టర్స్ తో చూడటం అలవాటు పడిన వారికి ఈ ఫొటో షూట్ కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తాయి.

అదే బాటలో...

అదే బాటలో...

దక్షిణ భారత సినీ పరిశ్రమలో లేడీ యాక్షన్‌ స్టార్‌గా విజయశాంతి ఖ్యాతి తెచ్చుకున్నారు. అదేవిధంగా కన్నడ హీరోయిన్‌ మాలాశ్రీ యాక్షన్‌ నటిగా పేరొందారు. అయితే దాదాపు ఇరవై ఏళ్లవుతున్నా ఎవరూ ఆ స్థానాన్ని భర్తీ చేయట్లేదు. ఇటీవల అనుష్క మాత్రం కాస్త ప్రయత్నాలు చేస్తోందనే చెప్పాలి. తాజాగా 'బాహుబలి', 'రాణి రుద్రమదేవి' చిత్రాల కోసం కత్తి పోరాటాలు ప్రారంభించింది. ఇప్పుడు అదే బాటలో తమన్నా కూడా నడుస్తోందట.

కల సాకారం..

కల సాకారం..

'బాహుబలి' కోసం అమ్మడు కత్తిసాము నేర్చుకుంటోందని సమాచారం. కొన్ని రోజులుగా తమన్నాకు సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కించారని తెలుస్తోంది. 'బాహుబలి'తో తన చిన్ననాటి కల కూడా సాకారమవుతుందని చెబుతోందీ మిల్కీవైట్‌ బ్యూటీ.

గాల్లో దీపం పెట్టద్దు..

గాల్లో దీపం పెట్టద్దు..

అద్భుతాలేం జరగవు ''దేవుడిపై నమ్మకం మంచిదే. అయితే మానవ ప్రయత్నం కూడా ఉండాలి. అదేం లేకుండా గాల్లో దీపంపెట్టి దేవుడా నీవే దిక్కు అని కూర్చుంటే అద్భుతాలేం జరగవు'' అని హితబోధ చేస్తోంది తమన్నా.

రెండూ ఫ్లాఫ్ అయినా...

రెండూ ఫ్లాఫ్ అయినా...

మహేష్‌బాబుతో కలిసి 'ఆగడు'లో నటిచింది. హిందీ చిత్రం 'హమ్‌షకల్స్‌' చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు ఆమెకు నిరాసనే మిగిల్చాయి.

నో బికినీ

నో బికినీ

నేను బికినీ వేస్తారని ఎవరన్నా చెప్పినా నమ్మద్దు..నా బాడీ లాంగ్వేజ్ కు బికినీ ఎలా నప్పుతుందనుకుంటున్నారు...కాబట్టి అలాంటి వార్తలు నమ్మొద్దు అని చెప్తోంది.

ఆ మూడే కాదు..

ఆ మూడే కాదు..

అదృష్టం కూడా...ఉండాలి. ఆమె మాట్లాడుతూ ''కృషి, పట్టుదల, దీక్ష.. ఇవి మూడే విజయానికి సోపానాలు అని నమ్మే వ్యక్తిని నేను. వీటికి అదృష్టం కూడా తోడవ్వాలి. '' అంటోంది.

కాలయాపన వద్దు...

కాలయాపన వద్దు...

'అయితే అదృష్టం ఒక్కదానిపైనే ఆధారపడి అంతా కాలయాపన చేస్తున్నారు. కొంతమందిని అదృష్టం అందలం ఎక్కించొచ్చు. కానీ... ఆ విజయం ఎంతోకాలం ఉండదు.'' అంటోంది.

ఫలితం మన చేతుల్లో ఉండదు కానీ...

ఫలితం మన చేతుల్లో ఉండదు కానీ...

''ఎంత కష్టపడినా సినిమా విడుదలయ్యేంత వరకే. ఒక్కసారి బయటకు వచ్చేస్తే ఫలితం ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కష్టపడకపోయినా విజయం వచ్చేస్తుంది అనుకోవడం భ్రమ మాత్రమే'' అంటోంది.

తమిళ తెరపైనా...

తమిళ తెరపైనా...

తమిళ తెరపై మిల్కీ వైట్‌ బ్యూటీ తమన్నా మరోమారు తళుక్కుమని మెరవనున్నారంటూ తమిళ తంబిలు ఆనందపడుతున్నారు. గతంలో ఆర్యతో 'బాస్‌ ఎంగిరా భాస్కరన్‌' (నేనే అంబాని) వంటి హిట్‌ సినిమాలు తీసిన దర్శకుడు రాజేశ్‌.... మళ్లీ ఆర్య, సంతానం కాంబినేషన్‌లో మరో చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సినిమాలో ఆర్య సరసన అందాల తమన్నా జోడీ కడుతున్నారు. ఇందులో ఆమెది చాలా కీలక పాత్రని సమాచారం.

రవితేజ సరసన...

రవితేజ సరసన...

రవితేజ సరసన తమన్నా ఆడిపాడబోతోంది. సంపత్‌ నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అందులో హీరోయిన్ గా తమన్నా ఎంపికయ్యిందంటూ వార్తలు వచ్చాయి. అదే నిజమేనంటూ ఆ విషయాన్ని తమన్నా ట్వీట్‌ చేసి అఫీషియల్ గా తెలిపింది. సినిమాలో మరో హీరోయిన్ కూ చోటుంది.

పెద్ద హీరోలతోనే..

పెద్ద హీరోలతోనే..

రీఎంట్రీలో ఏకంగా అజిత్‌తో జతకట్టి 'వీరం' వంటి బిగ్గెస్ట్‌ హిట్‌ను అందించింది. ప్రస్తుతం సూర్య, విజయ్‌లతో జతకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. వన్నెతగ్గని సోయగంతో.. దక్షిణాదిలో మోస్టు వాంటెడ్‌ హీరోయిన్‌గా హవా చాటుకుంటోంది తమన్నా ఇప్పుడు ఊహించని విధంగా కార్తితో మరోసారి ఈ ప్రాజెక్టులోకి వచ్చిందని సమాచారం.

తమన్నాతో ఇంకోసారి..

తమన్నాతో ఇంకోసారి..

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, తమిళ హీరో కార్తి కలసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు. ఈ భారి బడ్జెట్ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను సెలెక్ట్ చేశారనేది టాక్. ఈ సినిమాలో నాగార్జున, కార్తి ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తారని సమాచారం. అయితే అధికారికంగా దర్శకనిర్మాతల నుండి ఎటువంటి ప్రకటన రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X