'కెమెరామేన్ గంగతో..' లో తన పాత్ర గురించి తమన్నా

By Srikanya

హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ వారంలో విడుదల కానున్న ఈ చిత్రంలో కీలకంగా నిలిచే గంగ పాత్రలో తమన్నా కనిపించనుంది. సాప్ట్ వేర్ ప్రొఫిషినల్ గా 100% Love చిత్రంలో, కొరియాగ్రాఫర్ గా రెబెల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ 'కెమెరామేన్ గంగతో..' లో టీవీ జర్నలిస్టు గా కనిపించనుంది. ఈ పాత్ర టామ్ బోయ్ తరహాలో ఉంటుందని, అవార్డులు సైతం వరిస్తాయని ఇప్పటికే పూరీ జగన్నాధ్ చెప్పారు.

ఇక తమన్నా తన పాత్ర గురించి చెపుతూ..." ఈ సినిమాలో నా పాత్ర ఎప్పుడూ జర్నలిజం జాబ్ అంటే చాలా ఎక్సైట్ మెంట్ తో, కొద్దిగా ధైర్య సాహసాలు కూడినది మాత్రమే ఉంటుందనుకుంటుంటుంది. అయితే తర్వాత జర్నలిస్టు కి సమాజం పట్ల ఉండే భాధ్యత చాలా గొప్పదని రియలైజ్ అయ్యి ఓ పని నిమిత్తం పూర్తిగా డెడికేట్ అవుతాను.," అన్నారామె. అలాగే తాను ఎప్పుడూ హోమ్ వర్క్ చేసుకుని రానని, ఈ పాత్రకు సైతం కేవలం దర్శకుడు పూరీ జగన్నాధ్ చెప్పిన సూచనలు ఫాలో అయ్యి నటించానని, ఆ క్రెడిట్ మొత్తం పూరీ కే చెందుతాయని అన్నారు.

నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. 'పవన్‌కళ్యాణ్‌ ఓ పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. మంచి పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో పూరి జగన్నాధ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిమానులు అంతా మెచ్చేవిధంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌ హైలెైట్‌గా ఉండబోతున్నాయి అన్నారు. అలాగే పూరి జగన్నాధ్‌ ప్రత్యేకంగా పవన్‌ కోసం రాసిన డెైలాగ్స్‌కు థియేటర్లో చప్పట్లు మార్మోగుతాయి. ఏకధాటిగా సింగిల్‌ షెడ్యూల్‌లో ఇంతటి భారీ చిత్రాన్ని పూర్తిచేయడానికి ప్రధాన కారణం పవన్‌కళ్యాణ్‌, పూరిల సహకారం. మా బ్యానర్‌లో పవన్‌కి బిగ్గెస్ట్‌ హిట్‌ రాబోతున్నందుకు సంతోషంగా ఉంది' అన్నారు.

పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి దానయ్య, కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X