»   » నాగ్ తో రొమాన్స్ చేస్తానంటున్న బ్యూటీ తమన్నా..!

నాగ్ తో రొమాన్స్ చేస్తానంటున్న బ్యూటీ తమన్నా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమన్నా హఠాత్తుగా హీరో నాగార్జునని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేస్తోంది. 'ఇంద్రుడు, చంద్రుడు, మన్మధుడు...' అంటూ అతని అందాన్ని స్తుతిస్తోంది. 'ఆయనిప్పుడు ఫిఫ్టీ ప్లస్ లో ఉన్నప్పటికీ గ్లామర్ లో మాత్రం నెంబర్ వన్ గానే వున్నారు. వయసు మీద పడుతున్నా చెక్కుచెదరని గ్లామర్ తో మిల మిలా మెరిసిపోతున్నారు. నాగార్జున గారి స్మైల్, ఆయన బాడీ లాంగ్వేజ్ నాకెంతో ఇష్టం' అంటోంది తమన్నా.

నాగ్ తో నటించే అవకాశం వస్తే తనకది ప్రమోషన్ గా భావిస్తానని చెబుతోంది. 'ఆయన సినిమాలో నటించే చాన్స్ వస్తే అది అదృష్టంగా భావిస్తాను. ఎగిరి గంతేసి ఆ సినిమా యాక్సప్ట్ చేస్తాను. నా కెరీర్ కి అది ప్రమోషన్ అవుతుంది" అంటోంది తమన్నా. ఇప్పటికే కొడుకు నాగచైతన్యతో నటించిన తమన్నాకు, తండ్రితో కూడా నటించే చాన్స్ త్వరలో వస్తుందేమో చూద్దాం.

English summary
In a recent interview, Tamanna opined that Nagarjuna is the most glamorous hero in the Industry. 'Nag is the most glamorous hero in Tollywood. Though he is 50 plus, look at his glamour. I like his style, body language and the way he talks,' said Tamanna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu