మహేష్ బాబు కంటే రణబీర్‌కే ప్రాధాన్యమిస్తోంది
మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు తమన్నాను తీసుకోవాలని భావించినా.... ఆమె చేయడానికి నో చెప్పింది. దీనికి కారణం తమన్నాఇతర ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీగా ఉండటమే. ఈ సినిమా కోసం 80-90 రోజుల కాల్షీట్లు అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది అసాధ్యం, అందుకే సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని తమన్నా తండ్రి చెప్పారు.
కాగా....పాల మీగడలాంటి తమన్నా అందాలపై బాలీవుడ్ బాబుల కళ్లు పడ్డాయి. ఆమెను హీరోయిన్‌గా పెట్టి సినిమా చేయాలని అక్కడి దర్శకులు ప్రయత్నిస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా రూపొందబోయే బాలీవుడ్ సినిమాలో ఆమెను తీసుకోవాలని చూస్తున్నట్ల తమన్నా సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమన్నా ఈ సంవత్సరం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని ఆమె తండ్రి గతంలో ప్రకటించడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. బాలీవుడ్ ప్రాజెక్టు అనే సరికి ఎలాగైనా డేట్స్ అడ్జెస్ట్ చేయాలని చూస్తోందట ఈ అమ్మడు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల డేట్లు దర్శక నిర్మాతలో మాట్లాడి అడ్జెస్ట్ చేసుకునే పనిలో ఉందట. దీంతో తమన్నా మహేష్ బాబు కంటే రణబీర్ కపూర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, మహేష్ బాబు సినిమా కోసం ఇంతలా తాపత్రయ పడని తమన్నా బాలీవుడ్ అనే సరికి ఎక్కువ ఇంట్రెస్టు చూపుతోందని చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం తమన్నా రామ్ చరణ్ తేజతో రచ్చ చిత్రంతో పాటు...ప్రభాస్ సరసన రెబెల్ చిత్రంలో, రామ్ హీరోగా రూపొందుతున్న ఎందుకంటే ప్రేమంట చిత్రంలో, మరో తమిళ చిత్రంలోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











