»   » ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ యాడ్స్ మాత్రం చేయనంటోంది

ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ యాడ్స్ మాత్రం చేయనంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ తమన్నా... సౌత్‌‌లో స్టార్ హీరోయిన్, బాలీవుడ్ పరిశ్రమలోనూ అమ్మడుకి మంచి గుర్తింపు ఉంది. తాజాగా విడుదలైన బాహుబలితో తమన్నా రేంజి మరింత పెరిగింది. సినిమా స్టార్ అన్న తర్వాత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు యాడ్ ఫిల్మ్స్ చేస్తూ చేతి నిండా సంపాదించడమే మామూలే.

హీరోయిన్ తమన్నా... సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందు నుండే మోడలింగ్, యాడ్ ఫిల్మ్స్ చేయడం మొదలు పెట్టింది. గతంలో ఆమె పెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్ లో కూడా నటించింది. పాలరాతి బొమ్మలా మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా వెంట అప్పట్లో ఫెయినెస్ ప్రొడక్ట్స్ సంస్థలు వెంట పడేవి. అయితే ఇప్పుడు మాత్రం ఫెయిన్ నెస్ క్రీమ్ యాడ్స్ లో నటించే ప్రసక్తే లేదని అంటోంది. తనకు ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ యాడ్స్ మాత్రం చేయనంటోంది.

Tamanna regrets endorsing fairness products

ప్రస్తుతం నేను నటిగా సమాజం పట్ల ఒక బాధ్యతగల స్థానంలో ఉన్నాను. శరీర రంగు అనేది దేవుడు ఇచ్చింది. తెల్లగా ఉండే వారు ఎక్కువ, నల్లగా ఉండే వారు తక్కువ తేడా ఉండకూడదు. అందుకే ఇలాంటి యాడ్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. మనిషి గుణం, ప్రవర్తన బట్టే గుర్తింపు ఉండాలి కానీ, ఇలా శరీర రంగును బట్టి కాదు అని అంటోంది తమన్నా.

తమన్నా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె తెలుగులో మూడు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అందులో ఒకటి రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘బెంగాల్ టైగర్' చిత్రం కాగా, మరొకటి నాగార్జున-కార్తి మల్టీస్టారర్ మూవీ ‘ఊపిరి'. త్వరలో బాహుబలి 2 ప్రాజెక్టు షూటింగులో జాయిన్ కాబోతోంది తమన్నా.

English summary
Tamanna makes it clear she wouldn't endorse a fairness product again even if she was offered crores.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu