నెం వన్ కోసమే టెప్టింగ్ ఆఫర్స్ వస్తున్నా వద్దటోంది...!
తమిళ చిత్ర సీమ నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా, ఎంత డబ్బు ఆఫర్ చేసినా కానీ తమన్నా అస్సలు టెంప్ట్ కావట్లేదు. తెలుగు చిత్ర సీమకే నా ఓటు అంటూ ఇక్కడ వరుసగా సినిమాలు సైన్ చేస్తోంది. తెలుగునాట ఎలాగైనా టాప్ హీరోయిన్ అనిపించుకోవాలనే కోరికతోనే తమన్నా ఇంతగా పరితపిస్తోందని అర్థమవుతోంది.
అయితే ఇప్పుడు తమన్నాకి ఏకంగా బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. కాజల్ కి హిందిలో సింగంతో బ్రేక్ ఇచ్చిన అజయ్ దేవ్ గణ్ ఇప్పుడు తమన్నాకి కూడా బాలీవుడ్ టికెట్ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే ఇంతదాకా అతను తమన్నాని కాంటాక్ట్ చేయలేదు. తెలుగులో చరణ్, జూ ఎన్టీఆర్ తదితర స్టార్లతో నటిస్తున్న తమన్నా ఇక్కడ ఇంకా అనుకున్న పొజిషన్ కి రీచ్ కాలేదు.
ఇప్పుడిప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమ తమన్నాని గుర్తించి నెత్తిన పెట్టుకుంటోంది. ఈ టైమ్ లో ఆమె రూటు మార్చి మరో పడవలో కాలు పెడితే మొదటికే మోసమొస్తుంది. ఈ కారణం చేతనే తమిళం నుంచి పూర్తిగా మకాం మార్చిన తమన్నా ఒక్కసారి అదృష్టం పరీక్షించుకోవడానికి బాలీవుడ్ కి వెళుతుందా లేక మరికొన్నాళ్లు తెలుగుకే పరిమితమవుతుందా వేచిచూడాల్సిందే...


Click it and Unblock the Notifications











