బాలీవుడ్ ఆఫర్ ను తిరస్కరించిన ముద్దుగుమ్మ తమన్నా
ముంబయ్ లో మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ తార తెలుగు చిత్ర సీమలోకి ప్రవేశించకముందే బాలీవుడ్ లో 'చాంద్ సా రోషన్ చెహరా" అనే సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా పరాజయం కావడంతో ఈ తార తెలుగులో 'శ్రీ" చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత 'హ్యాపీడేస్" సాధించిన విజయంతో తెలుగులోనూ, తమిళంలోనూ అగ్రనాయికల్లో ఒకరిగా భాసిల్లుతున్నారు. ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా టాలీవుడ్, కోలీవుడ్ లలో సినిమాలు చేస్తున్న తమన్నాకు తాజాగా బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయని తెలిసింది.
ఇటీవల ఓ ఇంగ్లిష్ పత్రిక క్యాలెండర్ కోసం హాట్ హాట్ గా పోజులివ్వడం చూసి బాలీవుడ్ దర్శక, నిర్మాతలు తెగ ఇంప్రెస్ అయ్యారట. తమ చిత్రాల్లో నటించమని ఈ క్యూట్ గాళ్ కు ఆఫర్లు ఇస్తున్నారట. అయితే తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా వున్న తనకు ప్రస్తుతానికి బాలీవుడ్ లోకి వెళ్ళే ఆలోచన లేదని తమన్నా చెబుతున్నారు. అయితే పారితోషికం నచ్చకనే తమన్నా బాలీవుడ్ సినిమాని తిరస్కరించారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











