»   » ‘బాహుబలి’ : తన పాత్ర సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా..!

‘బాహుబలి’ : తన పాత్ర సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ఎక్కడ విన్నా బాహుబలి కబుర్లే, బాలీవుడ్ మీడియా సైతం ఈ చిత్రానికి మంచి ప్రయారిటీ ఇచ్చి కవర్ చేస్తోంది. చిత్రం ప్రమోషన్ లో భాగంగా... ప్రభాస్, రానా, తమన్నాలు ముచ్చటిస్తూ ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇక ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలిలో తన రోల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తమన్నా తెలిపింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రభాస్ సరసన హీరోయిన్‌గా కనిపించడానికి కొంత బరువు పెరగాల్సి వచ్చిందని, యువరాణి అవంతిక పాత్రలో కనిపించనున్న తమన్నా, ఆ పాత్ర కోసం కొన్ని ఫైట్లు కూడా చేయాల్సి వచ్చిందని తెలిపింది. తమన్నా అవంతిక పాత్రలో యువరాణిగా నటిస్తుంది.

తమన్నా మాట్లాడుతూ...ఈ సినిమా గురించి రాజమౌళి చెప్పినప్పుడు ఎంతో ఆశ్చర్యం, ఉత్సాహం కలిగాయి. సినిమా చిత్రీకరణలో రోజూ ఇలాంటి అనుభవాలు ఎన్నో. సినిమా కోసం తొలిసారిగా పోరాట సన్నివేశాలు, రోప్‌ వర్క్స్‌లో నటించాను. అంత భారీ స్థాయిలో చిత్రీకరించారు. ప్రభాస్‌ పక్కన నిల్చోవాల్సి వచ్చినప్పుడు ఎత్తు ఇబ్బందులు వచ్చి చిన్న కుర్చీ వేసేవారు.

పాటల దగ్గరకు వచ్చేసరికి వేళ్ల మీద నిలబడి డ్యాన్స్‌ చేశా. రాజుల కాలం నాటి సినిమా కాబట్టి కాళ్లకు చెప్పులు కూడా లేవు. కొన్నిసార్లు చాలా కష్టమైంది. అయినా ఇంతటి అద్భుతమైన సినిమాలో నటిస్తున్నాననే ఆలోచన ఎన్ని ఇబ్బందులనైనా దూరం చేసేది. రానాతో అయితే సన్నివేశాలేమీ లేవు అన్నారు.

తమన్నా పుట్టినరోజు సందర్భంగా ‘బాహుబలి' టీం విడుదల చేసిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అవంతిక లుక్ లు అద్బుత స్పందన లభించింది. అవంతిక పాత్రలో పాలరాతి శిల్పంలా కనిపించడానికి కాస్త శ్రమించానని చెప్తుంది తమన్నా.

ఇప్పటివరకూ ప్రేక్షకులు నన్ను గ్లామరస్ క్యారెక్టర్ లలో చూశారు. చారిత్రాత్మక యుగానికి చెందిన అవంతిక పాత్రలో కొత్త తమన్నాను చూస్తారు. కాస్ట్యూమ్స్, ఆభరణాలు ఇలా అవంతిక పాత్రకు సంబంధించి చాలా ఆలోచించాం, రీసెర్చ్ చేశాం. దర్శకుడు రాజమౌళి ఆరు కిలోలు బరువు తగ్గాల్సిందిగా సూచించారు. వర్కౌట్స్, డైట్ ఫాలో కావడం ద్వారా నేను బరువు తగ్గాను అని తమన్నా తెలిపారు.

ఈ సినిమా కోసం తమన్నా హార్స్ రైడింగ్, కత్తి యుద్దాలలో శిక్షణ తీసుకుంది. రిస్కీ స్టంట్స్ చేస్తుంది. ఇప్పటివరకూ నటించని కొత్త పాత్రలో నటిస్తుంది. బల్గేరియాలో ప్రభాస్ తో కలసి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో తమన్నా పాల్గొంనుంది.

Tamanna reveals secrets about her role in Baahubali

మంచు మనోజ్ హీరోగా రూపొందిన 'శ్రీ' చిత్రం ద్వారా పరిచయమైన మిల్కీ తమన్నా తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా నటించింది. గడిచిన ఈ పదేళ్ళలో దాదాపుగా తెలుగు స్టార్ హీరోలందరితో నటించింది. తన ఈ నట ప్రస్థానాన్నితలచుకుంటూ ఈ ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ ఉండాలని ప్రేక్షకులను కోరింది.

'బాహుబలి'అడుగడుగునా ఉత్కంఠే. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. వచ్చే నెల 10న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీన్ని హిందీలో కరణ్‌ జోహార్‌, ఎ.ఎ.ఫిల్మ్స్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.ఈ సందర్భంగా ప్రభాస్‌, రానా, తమన్నా ముంబయి మీడియాతో పంచుకొన్న అనుభవాలివీ.

ప్రభాస్ మాట్లాడుతూ...రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇప్పటివరకు 380 రోజులు చిత్రీకరించారు దర్శకుడు రాజమౌళి. అందులో నేను 300 రోజులు నటించాను. వేలమందితో వందల రోజులు చిత్రీకరించాం. మనసుకు ఎంతో దగ్గరైన సినిమా ఇది. మూడేళ్ల క్రితం రాజమౌళిగారు ఈ కథ గురించి నాకు చెప్పినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

సినిమా ట్రైలర్‌లో చూపించిన జలపాతాల దగ్గర సన్నివేశం అందరికీ నచ్చుతోంది. జలపాతం నేపథ్యంలో ఓ పాట కూడా ఉంటుంది. చిత్రీకరణలో భాగంగా తొలుత కొండ ఎక్కడం కష్టమనిపించింది. ఆతర్వాత ఐదారు రోజులకు బాగుందనిపించింది.అన్నారు.

రానా మాట్లాడుతూ...భారతీయ పరిశ్రమ గర్వించదగ్గ సినిమా ఇది. సినిమాలోని భావోద్వేగాలు బాగా పలికాయి.-తమన్నారాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా గొప్పతనాన్ని వర్ణించడానికి ఎన్ని ఉపమానాలు చెప్పినా చాలవు. మనసును తాకే ఓ అద్భుత దృశ్య కావ్యం ఈ చిత్రం. ఇద్దరు దాయాదుల మధ్య సాగిన పోరు ఇది. ఒకరు ప్రజల కోసం పాటుపడితే మరొకరు రాజ్యం ఏలాలనే కుతంత్రంతో ఆలోచిస్తుంటాడు. ఈ పోరులో విజయమెవరిదో తెరపైనే చూడాలి. అన్నారు.

English summary
In one of her interviews, Tamannah revealed some interesting facts about her role and said that she had to gain weight to look her part and match Prabhas’s hefty personality.
Please Wait while comments are loading...