‘సైరా నరసింహారెడ్డి’లో హీరోయిన్ తమన్నా పాత్ర ఎలా ఉండబోతోందంటే..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి భార్య పాత్రలో నయనతార నటిస్తోంది. ఇందులో హీరోయిన్ తమన్నా కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ పాత్రకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు బయటకు లీక్ అయ్యాయి.
ఈ చిత్రంలో తమన్నా నృత్యకారిణిగా కనిపించబోతోందని, నరసింహారెడ్డిని ప్రేమించే లక్ష్మి అనే పాత్రలో ఆమె నటిస్తోందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.

తమన్నా పాత్ర కీలకంగా
సైరాలో లక్ష్మి పాత్ర గురించి చెప్పిన వెంటనే తమన్నా చాలా ఎగ్జైట్ అయిందట. కేవలం ఇది పెద్ద సినిమా కావడం వల్లనో, చిరంజీవి నటిస్తున్న సినిమా అయినందునో కాదు... ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉండటంతో చేయడానికి ఓకే చెప్పిందట.
దేశభక్తురాలి పాత్ర
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సైరా నరసింహారెడ్డితో కలిసి పోరాటం చేసే దేశ భక్తురాలి పాత్రలో తమన్నా పెర్ఫార్మెన్స్ సినిమాలో హైలెట్ అయ్యే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇంతకు ముందు తమన్నా చాలా సినిమాలు చేసినా ఇందులో ఆమె నటనలోని కొత్తకోణం చూపించబోతున్నట్లు టాక్.

పోటాపోటీగా నయనతార, తమన్నా పాత్రలు
ఈచిత్రంలో నయనతార... సైరా నరిసింహారెడ్డి భార్య పాత్రను పోషించింది. నరసింహారెడ్డిని ప్రేమించే విషయంలో తమన్నా, నయనతార పాత్రలు పోటీపోటీగా ఉంటూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయని తెలుస్తోంది.

సైరా నరసింహారెడ్డి
‘సైరా' చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్' బేనర్లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











