నాగచైతన్య కోరిక.... ఆమె స్థానంలో తమన్నా
హైదరాబాద్: మిల్కీ బ్యూటీ తమన్నా నాగచైతన్య సరసన మరోసారి రొమాన్స్ చేయబోతోంది. తమిళ మూవీ 'వెట్టై'కి రీమేక్‌గా తెలుగులో రూపొందుతున్న చిత్రంలో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. తొలుత హన్సికను అనుకున్నప్పటికీ నాగచైతన్య పట్టుబట్టడంతో తమన్నాను ఫైనల్ చేసారు.
100%లవ్ చిత్రంలో నాగచైతన్య, తమన్నా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో వరుస ప్లాపులతో ఉన్న నాగచైతన్య ఆమెతో మళ్లీ తనకు లక్కు కలిసొస్తుందని ఆశిస్తున్నాడు. అందుకే పట్టుబట్టి మరీ దర్శక నిర్మాతలను ఒప్పించాడు.
మాధవన్, ఆర్య, సమీరారెడ్డి, అమల పాల్ ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన 'వెట్టై' మంచి విజయం సాధించింది. ఇదే చిత్రాన్ని తెలుగులో 'భలే తమ్ముడు' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో మాధవన్ పాత్రలో సునీల్, ఆర్య పాత్రలో నాగచైతన్య చేస్తుండగా వీరి సరసన ఆండ్రియా, తమన్నా హీరోయిన్లుగా ఫైనలైజ్ అయ్యారు. మల్టి డైమన్షన్ సమర్పణలో బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యు.టీవి వారి వద్దనుంచి బెల్లంకొండ రైట్స్ తీసుకున్నారు.
తెలుగు వెర్షన్ కి దర్శకుడుగా డాలీ(కిషోర్ కుమార్ పార్థసాని)ని ఎన్నుకున్నారు. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం చిత్రంతో దర్శకుడుగా మారిన డాలికి ఇది రెండో చిత్రం. యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్ సమాహారంతో ఈ చిత్రం రూపొందనుంది.


Click it and Unblock the Notifications











