అల్లు అర్జున్ తర్వాత రామ్ తో తమన్నా రొమాన్స్..
తమన్నాకి తమిళనాట ఆదరణ కరువైనట్టే కనిపిస్తోంది. గతేడాది అక్కడ 'పయ్యా" చిత్రంతో విజయాన్ని దక్కించుకొంది. గతేడాది అక్కడ 'పయ్యా' చిత్రంతో విజయాన్ని దక్కించుకొంది. ఆ తర్వాత రెండు భారీ పరాజయాల్ని చవిచూసింది. ఈ ఏడాది విక్రమార్కుడు తమిళ రీమేక్ హీరో కార్తీక్ 'సిరుతై' మీద ఎన్నో ఆశలు పెట్టుకొంది కానీ నిరాశే మిగిలింది. దాంతో ఇక తెలుగు మీదే ఎక్కువ ద్రుష్టి పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. ఇప్పటికే తమన్నా మూడు భారీ సినిమాలను అంగీకరించింది. మరో భారీ సినిమాకు పచ్చజెండా ఊపే అవకాశాలున్నాయి. బద్రీనాథ్ తో పాటు ఎన్టీఆర్, నాగచైతన్య చిత్రాలు ఆమె ఖాతాలో వున్నాయి.
త్వరలో రామ్ కధానాయకుడిగా యునైటెడ్ మూవీస్ పతాకంపై కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతుంది. ఈ చిత్రంలో రామ్ సరసన తమన్నాని నటింపజేసే అవకాశాలున్నాయి. ఈ సినిమా వేసవిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది.
తమన్నా రామ్ అల్లు అర్జున్ కార్తీక్ సిరతై విక్రమార్కుడు tamanna ram allu arjun karthi siruthai vikramarkudu


Click it and Unblock the Notifications