కాకమీదున్న ‘తమన్నా’ కేక పుట్టిస్తోంది...
తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరచుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా నటించిన తమిళ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది. తన అందాలతో యువతను కట్టిపడేస్తున్న తమన్నా యువత గుండెల్లో కాకే పుట్టిస్తోంది. దీంతో తమన్నా చిత్రాలకు తెలుగులో గిరాకీ పెరిగింది. దీంతో ఆమె నటించిన తమిళ చిత్రాలు తెలుగులో వరుసగా విడుదలవుతున్నాయి. ఈ కోవలోనే తమన్నా నటించిన తమిళ చిత్రం 'వేంగై" తెలుగులో 'సింహపుత్రుడు" పేరుతో అనువాదం కాబోతోంది. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి హరి దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో సీతారామ ఫిలింస్, రమా ప్రొడక్షన్స్ పతాకంపై బానూరు నాగరాజు, మోపూరి సుధాకర్ అందిస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ యాక్షన్ చిత్రమిది. ఆధిపత్యం కోసం ఎంతటి కైనా తెగించే ప్రతినాయకుడి ఎత్తులను ఎప్పటి కప్పుడు చిత్తు చేసే పాత్రలో ధనుష్ నటించాడు. ఆసక్తికలిగించే యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. హరి రూపొందించిన 'యముడు" తెలుగులో ఏస్థాయి విజయం సాధించిందో అంతకు మించిన విజయాన్ని ఈ చిత్రం సాధిస్తుందన్న నమ్మకముంది. దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం అలరిస్తుంది. ఈ నెలాఖరులో ఆడియోను, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. ప్రకాష్‌రాజ్, రాజ్‌కిరణ్ తదితరులు ముఖ్యపావూతలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: శవాంక్ వెన్నెలకంటి, పాటలు: చంద్రబోస్, వెన్నెలకంటి, సాహితి, సంగీతం: దేవీశ్రీప్రసాద్.


Click it and Unblock the Notifications











