తమన్నా ఇంత హాట్ గా..బోల్డ్ గానా? (ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : హోమ్లీ లుక్ తో ఉండే తమన్నా...హఠాత్తుగా ఇలా హాట్ లుక్ తో దర్శనమిచ్చే సరికి అంతా షాక్ అవుతున్నారు. బాలీవుడ్ వాసులను అలరించాలంటే ఈ మాత్రం హాట్ లుక్ తప్పనిసరి అని ఆమె ఫిక్సైనట్లుంది. అందులో భాగంగానే...'ఇట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌'చిత్రం లో ఆమె ఇలా కనిపించబోతోంది. ఆ చిత్రంలో ఆమెకు ఎంటర్‌టైన్‌మెంట్ అనే కుక్కకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయని చెప్తోంది. ఈ లుక్ వదిలి...ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు దర్శకుడు.

తమన్నా మాట్లాడుతూ...'' ఈ మధ్య 'ఇట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' అనే సినిమాలో చేశాను. ఈ సినిమాలో నా దగ్గర ఒక కుక్కపిల్ల ఉంటుంది. దాని పేరు ఎంటర్‌టైన్‌మెంట్‌. దానితో అలవాటైన తర్వాత ఇంటికి వచ్చాక వెలితిగా అనిపించేది. అందుకే అమ్మకు నచ్చజెప్పి ఓ కుక్కపిల్లను పెంచుకుంటున్నాను. దానికి పెబ్బెల్స్‌ అనే పేరు కూడా పెట్టాను. పెబ్బల్స్‌ ఇప్పుడు నా రాక కోసం ప్రతిరోజూ ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తోంది'' అని చెప్పింది తమన్నా.

Tamanna's Boldest Look Ever

బాలీవుడ్‌ సినిమా అంటే బికినీలు, లిప్‌లాక్‌లు సాధారణమంటుంటారు. దీనికి తగ్గట్టే చాలామంది హిందీ కథానాయికలు ఈ రెండు విషయాల్లో పెద్దగా అభ్యంతరాలు చెప్పరు కూడా. అయితే ''నేను మాత్రం బికినీలకు దూరం'' అంటూ తేల్చిచెప్పేసింది తమన్నా. అయితే తమన్నా నిర్ణయాన్ని చాలా మంది సపోర్టు చేస్తున్నారు చాలా మంది అభిమానులు. ఆమె బికినీ వేస్తే చూడలేం...అందుకు ఫిజిక్ సహకరించాలి అంటున్నారు.

'హిమ్మత్‌వాలా'తో హిందీలో రీఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ భాషల్లో అంగాంగ ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు చెప్పని ఈ భామ ఇక హిందీలో దుమ్ము దులుపుతుందిలే అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసింది. 'తమన్నా బికినీ వేసుకోదట.. లిప్‌లాక్‌కి కూడా దూరమట'' అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఈ విషయాన్ని తమన్నా దగ్గర ప్రస్తావిస్తే.. ''అసలు బికినీ ఎందుకు వేసుకోవాలి? బికినీలకు దూరమని నేనెప్పుడో చెప్పాను. పాత్ర అవసరం మేరకు అందాల ప్రదర్శనకు నేను విరుద్ధం కాదు. అలాగని అవసరం లేకుండా లిప్‌లాక్‌లు, బికినీలు ఎందుకు? అందుకే 'హమ్‌ షకల్స్‌'లో నా తోటి హీరోయిన్స్ బిపాసా బసు, ఇషా గుప్తా బికినీలు వేసుకున్నా.. నేను మాత్రం దూరంగా ఉన్నాను'' అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X