»   » తమన్నా అందంతో ఆకర్షణ, వ్యాపారం సాగేనా?

తమన్నా అందంతో ఆకర్షణ, వ్యాపారం సాగేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మా బ్రాండ్ సారీలు కొంటే మీరూ హీరోయిన్లలా అందంగా కనిపిస్తారు అంటూ....స్టార్ హీరోయిన్లతో ప్రచారం చేయించడం ప్రస్తుతం నడుస్తున్న బిజినెస్ సూత్రం. ఇప్పటికే సమంత, కాజల్ లాంటి టాప్ హీరోయిన్లు పలు సారీ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమన్నా కూడా ఆ లిస్టులో చేరింది.

'Joh Rivaaj' సారీ బ్రాండ్‌కు తమన్నా ప్రచారం చేయబోతోంది. ఇందుకోసం అమ్ముడు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నేట్లు సమాచారం. తమన్నా వంటి అందమైన హీరోయిన్ తమ సారీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా నియమించుకోవడం వల్ల వ్యాపారం పెరుగు మరింత పెరుగుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఆ బ్రాండ్ యజమాని వినోద్ కోఠారి.

తమన్నా సినిమాల విషయానికొస్తే...పలు సౌత్ ప్రాజెక్టులతో పాటు, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ సాజిద్-పర్హాద్ 'ఇట్స్ ఎంటర్టెన్మెంట్స్' చిత్రంతో పాటు, సాజిద్ ఖాన్ 'హమ్ షకల్' చిత్రంలో నటిస్తోది. సౌత్‌లో సిరుతై శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ మూవీ 'వీరమ్'లో నటిస్తోంది. మహేష్ బాబు తర్వాతి సినిమా 'ఆగడు' చిత్రంలో కూడా తమన్నా హీరోయిన్‌గా ఎంపికయినట్లు తెలుస్తోంది.

English summary

 After Sajid Khan's Himmatwala, it seems that actress Tamanna Bhatia wants to cash in on her 'desi' image. The southern beauty has been appointed the brand ambassador for saree brand Joh Rivaaj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu