పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలనుకొన్నా.. అందుకే పిఠాపురంలో ఆయనపై పోటీ చేస్తున్నా.. తమన్నా సింహాద్రి
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశమైన నియోజకవర్గం పిఠాపురం. అందుకు కారణం జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఈ స్థానంపైనే ఉంది. అయితే పవన్ కల్యాణ్‌ను ఎదుర్కొనేందుకు పలు రకాల పార్టీలో రంగంలోకి దిగాయి. ఈ స్థానం నుంచి బిగ్‌బాస్ తెలుగు కంటెస్ట్, సామాజిక కార్యకర్త, నటి, ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి పోటీకి దిగారు. అయితే తాను పిఠాపురం నుంచే ఎందుకు పోటీ చేయాలనుకొన్నాననే విషయంపై ఆమె జాతీయ దిన పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ..
గత అసెంబ్లీ ఎన్నికల్లో తమన్నా సింహాద్రి మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. తెలుగు దేశం పార్టీ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్‌పై పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. దాంతో ఆమె రాజకీయ, సినీ వర్గాల్లో అందర్నీ ఆకట్టుకొన్నది. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగులోకి వచ్చి తన వంతుగా మెప్పించే ప్రయత్నం చేశారు.

ఇక తాజాగా భారతీయ చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా తమన్నా సింహాద్రి బరిలోకి దిగారు. అయితే తాను పోటీచేయడంపై స్పందిస్తూ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతందో తెలియదు. వ్యక్తిగతంగా ఉండే అంచనాలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మారిపోతుంటాయ. నేను ఎప్పుడూ పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మా పార్టీ అధినాయకత్వం టికెట్ ఇచ్చి పోటీ చేయాలన్నారు. నేను మరో మాట ఆలోచించకుండా పోటీ దిగాను అని అన్నారు.
గతంలో నేను పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేసింది నిజమే. కానీ సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులకు అన్యాయం జరుగుతున్నదనే కారణంతో శ్రీరెడ్డి ఉద్యమం చేపట్టడంతో ఆమెకు సపోర్ట్ చేశారు. ఆమె పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసింది. ఆ టార్గెట్ వెనుక సినిమా డైరెక్టర్ ఉన్నాడని తెలియడంతో.. అప్పటి నుంచి నేను పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేస్తూ వచ్చాను అని తెలిపారు.

అయితే నేను పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలనుకొన్నాను. కానీ ఆయచన సీఎం పరిస్థితిలో లేడు. అందుకే ఆయన నాకు బలమైన ప్రత్యర్థి అనుకొన్నాను. ప్రతీ ఒక్కరు బలమైన అభ్యర్థిని కోరుకొంటారు. నేను అదే కోరుకొన్నాను. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పిఠాపురం స్థానాన్ని నేను ఎంచుకొన్నాను అని తమన్నా సింహాద్రి తెలిపారు.
లోకేష్ పోటీ చేయడం ద్వారా ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ పోటీ తర్వాత గిన్నిస్ బుక్ అవార్డు కూడా లభించింది. గత ఎన్నికల్లో ఓటమి వల్ల లభించిన అనుభవాన్ని ఈ సారి విజయం కోసం ఉపయోగిస్తాను. వంగవీటి మోహన రంగా ఆశయాల కోసం నేను పాటుపడుతాను అని తమన్నా సింహాద్రి తెలిపారు.


Click it and Unblock the Notifications











