మగాళ్లను ఉద్దేశ్శించి తమన్నా రిక్వెస్ట్

By Srikanya

తాజాగా తమన్నా...మగాళ్ళని ఉద్దేశ్శించి ఓ రిక్వెస్ట్ చేసింది. అది మరేదో కాదు...కట్నం తీసుకోవద్దని. ఆమె రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ...కట్నం వేధింపులు తట్టుకోలేక కొంతమంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారని విన్నప్పుడు, వార్తా పత్రికల్లో చదివినప్పుడు ఎంతో బాధపడుతుంటాను. అందుకే మగవాళ్లందర్నీ దయచేసి కట్నం తీసుకోవద్దు అని కోరుకుంటున్నాను అంది. అలాగే ఆమెకు కట్నం డిమాండ్ చేసే వాళ్ళంటే కాలుతుందిట. ఈ విషయం గురించి చెబుతూ...స్ర్తీ లేకపోతే సృష్టి అనేది లేదు. అలాంటప్పుడు కట్నం ఎందుకు ఇవ్వాలి..ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి భర్తకు, పిల్లలకు కావల్సినవన్నీ సమకూర్చుతూ వాళ్లే ప్రపంచంగా బతుకుతుంది స్ర్తీ. అటువంటి మహిళలను గౌరవించాల్సింది పోయి కట్నం కోసం వేధించడం అమానుషం అంది. అలాగే కట్నం అడిగే వారిని చూస్తుంటే విచిత్రంగా ఉంటుంది అంది. అలాగే ఒకవేళ రేపు నన్ను కట్టుకోబోయేవాడు కట్నం అడిగితే...నేనా సంబంధాన్ని వద్దనే చెపుతానని నిక్కచ్చిగా చెప్పింది..అదీ సంగతి. ఇక ప్రస్తుతం తమన్నా...గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న 'బద్రీనాథ్‌' చిత్రంలో నటిస్తోంది. అలాగే నాగచైతన్య సరసన సుకుమార్ దర్సకత్వంలో రూపొందే చిత్రంలోనూ ఆమె చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X