‘100% లవ్’ ప్రేక్షకులకు అందుకే బాగా నచ్చింది ..తమన్నా
సినిమా అంతా ఫ్రెష్ లుక్ ఉండడంతో ప్రేక్షకులకు బాగా నచ్చింది. నేను ధరించిన మహలక్ష్మి పాత్రలో ప్రతి అమ్మాయి తన పాత్రగా భావిస్తోంది. ఓ మంచి అవకాశాన్ని ఈ చిత్రం ద్వారా పొందాను.నాగచైతన్య, తమన్నా జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో బన్ని వాసు నిర్మించిన '100% లవ్" విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సాధించిన విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి తమన్నా దర్శకుడు సుకుమార్, నిర్మాత బన్నివాసు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే ఈ చిత్రంలో పనిచేసేటప్పుడు దర్శకుడిని ప్రతి సన్నివేశం అడిగి తెలుసుకుని చేశాను. ఆ కష్టానికి తగిన ఫలితంగా విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని అంది.


Click it and Unblock the Notifications











