చెప్పినప్పుడు భయపడ్డాను...తమన్నా
దర్శకుడు సుకుమార్ మహాలక్ష్మి పాత్ర గురించి చెప్పినప్పుడు భయపడ్డాను. ముందు నా వల్ల కాదు అనుకొన్నాను. కష్టపడి చేశాను. అందుకే అంత మంచి పేరొచ్చింది..అని చెప్తోంది తమన్నా. నాగచైతన్య హీరోగా వచ్చిన 100% లవ్ చిత్రం ఎందుకు హిట్ అయిందో విశ్లేషిస్తూ ఇలా చెప్పుకొచ్చింది.అలాగే ఈ సినిమాలో నీ పాత్ర ఇది అని చెప్పగానే ముందు భయపడాలి. అమ్మో నేను చేయగలనా, లేదా అని ఒకటికి పదిసార్లు ప్రశ్నించుకోవాలి. ఇది కచ్చితంగా పేరొచ్చే పాత్రే అని చెప్పడానికి అదే తొలి సూచన అంది తమన్నా. ప్రస్తుతం తమన్నా ఎన్టీఆర్, చరణ్, రామ్ చిత్రాలతో పూర్తిగా బిజీగా ఉంది. తన కెరీర్ ని విశ్లేషిస్తూ..కలకాలం సినీ రంగంలో కొనసాగాలి అని కంకణం కట్టుకోలేదు. ఉన్నంతలో మంచి పాత్రలు చేయాలి. సినీ రంగంలో పేరు సంపాదించుకొన్న హీరోయిన్స్ ను ఓసారి గమనించండి. వాళ్లు చేసిన వాటిలో ఎక్కువగా గ్లామర్ పాత్రలే. అయితే మధ్య మధ్యలో ప్రేక్షకుల దృష్టి మళ్లించారు. అలాంటి పాత్రలు లభిస్తే కెరీర్‌కు ఢోకా లేనట్టే అంది.కరెక్టే కావచ్చు.


Click it and Unblock the Notifications