మంచు మనోజ్ తో చేసిన సినిమాతోటే బుద్ది వచ్చిందంటోన్న తమన్నా
ఇప్పుడు స్టార్ గా వెలుగుతున్న తమన్నా ప్రారంభం రోజుల్లో మంచు మనోజ్ తో దశరధ్ దర్సకత్వంలో 'శ్రీ' చిత్రంలో చేసింది. అయితే అది భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఆమెకు హ్యాపీడేస్ వరకూ అవకాశాలే రాలేదు. హ్యాపీడేస్ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే లేదు. ఈ విషయం వివరిస్తూ కెరీర్ ప్రారంభం అయిన రోజుల్లో వచ్చిన అవకాశం వదులుకోకూడదనే ఉద్దేశం తోటే సినిమా చేసాను. దాంతో నాకు ఫ్లాప్ లు వచ్చాయి. అలాగే ఆ తర్వాత చేసిన కొన్ని చిత్రాలు కూడా నా వయస్సుకు మించిన పాత్రలు ఉన్నాయి. అవీ ఫ్లాప్ అయ్యాయి. దాంతో నేను ఎటు వెళ్ళాలో అర్దమైంది. నేను రియలైజ్ అయ్యాను. నాకు, నా వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్థున్నాను అంది. ప్రస్తుతం తమన్నా ఎన్టీఆర్ సరసన సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ, రామ్ చరణ్ సరసన మరో సినిమాలోనూ నటిస్తోంది. అలాగే నాగచైతన్యతో '100% లవ్', అల్లు అర్జున్‌తో 'బద్రినాథ్' చిత్రాలు చేసింది. త్వరలోనే ఇవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. '100% లవ్'లో మహాలక్ష్మి అనే కాలేజీ విద్యార్థిని పాత్రను పోషించింది.


Click it and Unblock the Notifications











