పవన్ మాత్రమే న్యాయం చేయగలడు: తమన్నా

By Bojja Kumar

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై వివాదాల అనంతరం....మళ్లీ కలెక్షన్ల పరంగా దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ తమన్నా ఈచిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది.

రాంబాబు పాత్రకు పవన్ కళ్యాణ్ తప్ప ఎవరూ న్యాయం చేయలేరని, ఆయన ఆ పాత్రలో అద్భుతంగా నటించారని పేర్కొంది. సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు పవర్ ఫుల్ డైలాగులు మరెవరి వల్లా కాదని, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి షాకయ్యానని చెప్పుకొచ్చింది. పవన్ గారితో తొలిసారి కలిసి పని చేయడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని, ఆయన వ్యక్తిత్వం ఎంతో భిన్నంగా ఉంటుందని, ఏ యాంగిల్ లో చూసినా పవన్ స్టార్ గ్రేట్..ఆయనకు హాట్సాఫ్ అంటూ తన అభిమానాన్ని వెలుబుచ్చింది.

కాగా...సినిమా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెలుతోంది. తొలి నాలుగు రోజుల కలెక్షన్స్ చూస్తే... ఈ చిత్రం పవన్ గత సినిమా 'గబ్బర్ సింగ్'ను వసూళ్ల పరంగా అధిగమించింది. అయితే ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం గబ్బర్ సింగ్ రికార్డును ఈ చిత్రం బద్దలకు కొట్టలేక పోయింది.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా పతాకంపై డి వివి దానయ్య నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. సినిమా ఓక రిపోర్టర్ కు, రాజకీయ నాయకుడికి మధ్య పోరాటం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో చూపించిన కొన్ని సన్నివేశాలు, డైలాగులు తెలంగాణ వాదులకు ఆగ్రహం తెప్పించడంతో సదరు సీన్లను తొలగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X