twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీగా నిలిచిన బ్యూటీ హీరోయిన్...!

    By Sindhu
    |

    తెలుగులో సరైన అవకాశాలు లేక ఇన్నాళ్లూ తమిళంలో సినిమాలు చేస్తూ నెట్టుకొచ్చిన తమన్నా, ఇప్పుడు ఒక్కసారిగా టాలీవుడ్ లో జోరందుకుంది. అది కూడా మిగతా హీరోయిన్లకి గట్టి పోటీగా..! ప్రస్తుతం పూరి దర్శకత్వంలో అల్లు అర్జున్ తో 'బద్రీనాథ్', నాగ చైతన్యతో 'నేనే నంబర్ వన్' చిత్రాలు చేస్తున్న ఈ తెల్లతోలు భామ తాజాగా మరో మూడు పెద్ద సినిమాలను యాక్సప్ట్ చేసింది.

    యన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'రచ్చ' సినిమాకు , రామ్ హీరోగా కరుణాకరన్ డైరెక్ట్ చేసే ప్రేమ కథా చిత్రానికి ఇప్పటికే తను సైన్ చేయగా... లేటెస్ట్ గా రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి కూడా తమన్నానే సెలెక్ట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అలాగే, ఓకే చేయాల్సిన మరికొన్ని ప్రాజక్ట్స్ కూడా వున్నాయట. సో... తనకి బ్రేక్ కాస్త లేట్ గా వచ్చినా మంచి బ్రేకే వచ్చిందని అంటున్నారు. అన్నట్టు, ఈ బుల్లెమ్మ ఒక్కో సినిమాకి కోటి పైనే తీసుకుంటోందట. ఆ విషయంలో మాత్రం తమన్నా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందంటారు.

    English summary
    The latest news from the tinsel town says that Tamanna has been roped into play the female lead in it. Tamanna is currently doing Badrinath starring Allu Arjun and Naga Chaitanya – Sukumar film. She is also doing the female lead in NTR, Surender Reddy film. If Tamanna signs on the dotted line for Ram Charan’s next movie then she will go one step above in the rat race of current set of heroines.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X