టుడే రిలీజ్ తమన్నా 'ఆవారా' కథేంటి?
తమన్నా తాజా చిత్రం ఆవారా ఈ రోజు(21 మే) రీలీజ్ అవుతోంది. 'రన్', 'పందెం కోడి' వంటి హిట్ యాక్షన్ చిత్రాల లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తమిళంలో పయ్యా పేరుతో రూపొంది తెలుగులోకి డబ్బింగ్ అయింది. కథ ప్రకారం ఆవారాగా తిరిగే శివ(కార్తి)ఓ ఇంటర్వూ నిమిత్తం బెంగుళూరు వస్తాడు. అక్కడ తన క్లోజ్ ప్రెండ్స్ తో తిరుగుతూంటే చారు(తమన్నా)తగులుతుంది. కామన్ గానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అంతేగాక కలలు కని పాటల పాడి ఎంజాయ్ చేస్తూంటాడు. హఠాత్తుగా ఓ రోజు ఆమె పలకరించి తనని ముంబయి తీసుకుపొమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. విషయం ఏమిటీ అని ఆరా తీస్తే ఆమె సవతి తల్లి తన తమ్ముడుని చేసుకోమని బలవతం పెడుతోందని తెలుస్తుంది.
అప్పుడు శివ ఆమెను తీసుకుని ముంబయి ప్రయాణం పెట్టుకుంటాడు.హైవే మీద వెళ్థూంటే వాళ్లని రౌడీలు వెంబడించి ఎటాక్ చేస్తూంటారు. తన తెలివి తేటలతో డ్రైవింగ్ ఎక్సిపీరియన్స్ తో వేరే రూటులో ముంబయి ప్రయాణం చేస్తూంటాడు శివ. ఈ లోగా మరో గ్యాంగ్ ఎటాక్ చేస్తుంది. వాళ్ళు ముంబయి నుంచి వచ్చిన వాళ్ళు. అయితే వాళ్ళు శివని టార్గెట్ చేస్తారు. వాళ్ళు చారు ని వదిలేస్తారు. వాళ్ళతో ఫైట్ చేసిన తర్వాత శివ వాళ్ళెవరు...ముంబైతో తనకు ఉన్న సంభందం ఏమిటన్నది ఫ్లాష్ బ్యాక్ వివరిస్తాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద ఫైట్స్ చేస్తూ ఆ గ్యాంగ్ లనుంచి తప్పించుకుంటూ ఎలా శివ తన ప్రేమని సక్సెస్ చేసుకున్నాడని మిగతా కథ
ఈ చిత్రం గురించి దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ...రాంగోపాల్ వర్మ శైలిలో భారతీరాజా కథను చెబితే ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. అలాగే ఒక మంచి కథను స్టైలిష్‌గా చెప్పడం జరిగింది, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అంటున్నారు. అలాగే ఈ చిత్రంలో హీరోగా కార్తీ (పరుత్తి వీరన్, యుగానికొక్కడు ఫేం) చేసారు.


Click it and Unblock the Notifications











