నడుం చూపించిన తమన్నాపై మండిపడుతున్న మహిళా సంఘాలు
కొత్త పుంతలు తొక్కుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాలు సర్వ సాధారణమైపోయాయి. పంజాబీ ముద్దుగుమ్మ తమన్నా భాటియా తెలుగులో నటించిన తాజా చిత్రం "100% లవ్"లో నడుం చూపించిన సన్నివేశాలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. ఈ చిత్రంలోని చాలా సన్నివేశాల్లో తమన్నా తన అందమైన నడుము ఎక్స్‌పోజ్ చేస్తుంది. ప్రత్యేకించి ఓ సన్నివేశంలో అయితే విద్యార్థులందరూ ఎగ్జామ్ రాస్తుండగా.. తమన్నా తన టాప్ పైకెత్తి నడుంపై రాసుకొచ్చిన చిట్టాను నాగచైతన్యకు చూపిస్తుంది.
ఈ సన్నివేశాలపై మహిళా సంఘాలు మండి పడుతున్నారు. చిత్రంలో వీటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది మహిళలను అవమానపరచడమేనని నినాదాలు చేస్తున్నారు. దక్షిణాధిలో మంచి ప్రాధాన్యం తెచ్చుకొంటున్న ఆమె ఇలాంటి సన్నివేశాలు చేయడం సరికాదని, ఇది యువతపై చెడు ప్రభావాలను చూపే ఆస్కారం ఉందని అంటున్నారు. ఏదేమైనప్పట్టికీ. నాగచైతన్య-తమన్నా కాంబినేషన్‌లో మొదటిసారిగా వచ్చిన 100% లవ్ చిత్రం మంచి టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద నిలకడా సాగుతోంది.


Click it and Unblock the Notifications











