కథ నచ్చకపోతే అలా చేస్తా: తమన్నా
''చాలా మంది స్క్రిప్టులు పట్టుకొని వస్తారు. 'మా సినిమాలో మీరే హీరోయిన్' అని కథ చెప్పడం మొదలుపెడతారు. రెండు సీన్స్ గడిచేసరికి కథలో కొత్తదనం లేదనే విషయం తెలుస్తుంది. అయితే 'నచ్చలేదు, చేయను' అని చెబితే వాళ్ల మనసు బాధపడుతుంది. అందుకే ఆ క్షణం నేను ఏమీ మాట్లాడను. 'కథ బాగుంది. కానీ నాకంటే కాస్త అనుభవం ఉన్నహీరోయిన్ ని తీసుకొంటే ఇంకా బాగుంటుంది. ఆలోచించండి' అని చెబుతాను. విషయం వాళ్లకీ అర్థమైపోతుంది అంటోంది తమన్నా.ఇక తన అందం సీక్రెట్ గురించి చెపుతూ.. ''వ్యాయామ నియమాలు, యోగా ఇలా ఎన్ని చేసినా, సరిగా నిద్రపోకపోతే ఆ ప్రభావం చాలా ఉంటుంది.
కంటి నిండా నిద్రపోతే తెల్లారేసరికి ముఖం మరింత కాంతివంతం అవుతుంది. అలాగని గంటల తరబడి నిద్రపోవలసిన అవసరం లేదు. ఒక్క గంటైనా ప్రశాంతంగా పడుకొంటే చాలు'' అని చెబుతోంది.ప్రస్తుతం తమన్నానే తెలుగులో హాట్ హీరోయిన్. ప్రస్తుతం తమన్నా ఎన్టీఆర్ సరసన ఊసరివిల్లి చిత్రంలో చేస్తోంది. ఆ చిత్రంలో ఆమె గతం మర్చిపోయే అమ్మాయిగా కనిపించనుంది. అలాగే రామ్ చరణ్ సరసన రచ్చ చిత్రంలో ఆమె డబ్బున్న అమ్మాయిగా కనిపించనుంది. వీటితో పాటు ఆమె రామ్ సరసన కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలోనూ చేస్తోంది. తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నా ఆమె కొత్తగా ఏమీ కమిట్ కావటం లేదు. డేట్స్ ఖాళీ లేవని పూర్తిగా తెలుగు మీదే కాన్సర్టేట్ చేసింది. అలాగే ప్రబాస్, లారెన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్న రెబెల్ లోనూ ఆమెనే తీసుకున్నారని తెలుస్తోంది. మరిన్ని పెద్ద ప్రాజెక్టులలో ఆమెనే డైరక్టర్స్ తీసుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు.


Click it and Unblock the Notifications











