»   » ఆ హీరోతో స్టెప్స్ కు తమన్నా ఇబ్బంది

ఆ హీరోతో స్టెప్స్ కు తమన్నా ఇబ్బంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

బద్రీనాధ్ చిత్రంలో బన్నీతో పోటీపడి డాన్స్ చేసిన తమన్నాకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చింది. టాలీవుడ్ లో డాన్స్ లు పోటీ బాగా పెరిగిపోయింది. ఆమె నటిస్తున్న మూడు చిత్రాల హీరోలు..ఊసరవిల్లి ఎన్టీఆర్, రచ్చ..రామ్ చరణ్, ఎందుకంటే ప్రేమంటే..రామ్, ముగ్గురూ డాన్స్ లు అదరకొట్టేవాళ్ళే. ఆ డాన్స్ లకు తగినట్లుగా తమన్నా ఎడ్జెస్టు అయి డాన్స్ చేయాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. దాంతో తమన్నా చాలా ఇబ్బందులు పడుతోందని వినికిడి. ఆ హీరోలు కొరియోగ్రాఫర్స్ ని రప్పించుకుని ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వారికి తగినట్లుగా తమన్నా కూడా కష్టపడుతోంది. హీరోల మధ్య పోటీ తనను ఇబ్బందిపెడుతోందని సన్నిహితులు వద్దవాపోతోంది. ముఖ్యంగా రామ్ తో చేస్తున్నప్పుడు ఈ మధ్యన ఆమె చాలా ఇబ్బంది పడిందని చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్ అయితే ఊసరివిల్లి చిత్రం కోసం ముగ్గురు కొరియోగ్రాఫర్స్ ని పెట్టుకుని ఓ పాట ప్లాన్ చేయించుకున్నారు. మరోప్రక్క రామ్ చరణ్ తన ప్రతిభ మొత్తం రచ్చలో చూపాలని తాపత్రయపడుతున్నారు. వీరందరి డాన్స్ ల మధ్యా తమన్నా నలుగిపోతోంది.

English summary
Tamanna had become one of the busy heroines in the south Indian film industry in general and Telugu in particular. She is presently working with NTR for Oosaravelli, Rachcha with Ram Charan and Endukante Premanta with Ram. All the three are excellent dancers and have their own and different styles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu