అది తమన్నా వద్ద ఉంది: యజమానులొచ్చి తీసుకోవచ్చు
ముంబై: హీరోయిన్ తమన్నాకు ఇటీవల ముంబై వెస్ట్ ఖార్ ప్రాంతంలో నుండి ఒక కుక్కను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంది. ఆ కుక్కను ఎలాగైనా యజమానికి అందించడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే...వెస్ట్ ఖార్ ప్రాంతం నుండి తమన్నా వెలుతుండగా తప్పిపోయిన కూకర్ స్పానియేల్ జాతికి చెందిన కుక్క కనిపించింది.
తన యజమాని ఇంటి నుండి తప్పి పోయిన ఆ కుక్క....ఖార్ ప్రాంతంలో దిక్కు మొక్కు లేకుండా తిరుగుతోంది. వీధి కుక్కలకు భయపుడూ బిక్కు బిక్కు మంటున్న ఆకక్కను చూసి జాలి పడ్డ తమన్నా వెంటనే దాన్ని తన ఇంటి తీసుకొచ్చింది. దానికి తిండి పెట్టడంతో పాటు యజమానులకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది.

అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని యజమాని ఎవరో తెలియక పోవడంతో....ట్విట్టర్లో ఆ కుక్క ఫోటోను పోస్టు చేసింది. యజమానుల గురించి సమాచారం తెలిసినవారు +91 7738-169914 ఫోన్ చేయాలని తెలిపింది. మరి తమన్నా ప్రయత్నం ఫలిస్తుందో? లేదో?....


Click it and Unblock the Notifications











