»   » బాహుబలి: తమన్నా గురించి గొప్పగా చెప్పిన రాజమౌళి

బాహుబలి: తమన్నా గురించి గొప్పగా చెప్పిన రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మిల్కీ బ్యూటీ తమన్నా రాజమౌళి దర్శకత్వంలో తొలిసారిగా 'బాహుబలి' చిత్రానికి పని చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో ఈచిత్రం తెరకెక్కుతోంది. తమన్నా గురించి రాజమౌళి మాట్లాడుతూ తమన్నా నటించడం వల్ల 'బాహుబలి' సినిమా విలువ మరింత పెరుగుతుందని అన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి లీడ్ రోల్స్ చేస్తున్నారు.

ఇటీవలే తమన్నా 'బాహుబలి' సినిమా షూటింగులో పాల్గొన్నారు. ఈ రోజు తమన్నా గురించి రాజమౌళి తన ట్విట్టర్లో వ్యాఖ్యానిస్తూ...'తొలిసారిగా తమన్నాతో కలిసి పని చేస్తున్నాను. ఆమె పెర్ఫార్మెన్స్‌కు ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఆమె వల్ల బాహుబలి సినిమాకు విలువ మరింత పెరుగుతుంది' అంటూ ట్వీట్ చేసారు.

Tamanna A Value Addition To Baahubali: Rajamouli

ఈ చిత్రంలో తమన్నా యువరాణి అవంతిక రోల్ చేస్తోంది. తమన్నా కూడా రాజమౌళి గురించి ట్వీట్ చేసారు. రాజమౌళి లాంటి బ్రిలియంట్ డైరెక్టర్‌తో పని చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. బాహుబలి సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాను' అంటూ ట్వీట్ చేసారు.

బాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రసాద్ దేవినేని, శోబు యార్లగడ్డ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Ace filmmaker SS Rajamouli has teamed up with actress Tamanna Bhatia for the first time in his upcoming bilingual Baahubali, which is simultaneously made in Telugu and Tamil. The director is so impressed with the latter's potential that he feels the actress is a value addition to the mega-budget project starring Prabhas, Rana Daggubati and Anushka Shetty in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu