త్రివిక్రమ్ డైరెక్షన్: తమన్నాకు జోడీగా విరాట్ కోహ్లి
హైదరాబాద్: హాట్ హీరోయిన్ తమన్నా, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి త్వరలో కలిసి నటించబోతున్నారు. అయితే ఇదేదో సినిమా కోసం మాత్రం కాదు. ఓ టీవీ కమర్షియల్ యాడ్ కోసం. తమన్నా గత కొంత కాలంగా సెల్ కాన్ అనే మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తమన్నా హిమ్మత్ వాలా చిత్రంతో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టిన నేపథ్యంలో..... తమ కంపెనీ మొబైల్స్ ప్రమోషన్ కోసం భారీ యాడ్‌కు శ్రీకారం చుట్టింది. సెల్ కాన్ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, తమన్నాలతో కలిసి యాడ్ ఫిల్మ్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు.
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ యాడ్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించబోతున్నారు. అక్టోబర్ 14న ముంబైలో ఈ యాడ్ చిత్రీకరణ జరుగనుంది. గతంలో త్రివిక్రమ్‌కు పలు కమర్షియల్ యాడ్లకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ధోనీ, రామ్ చరణ్‌లతో గతంలో ఓ కూల్ డ్రింక్ యాడ్ అద్భుతంగా చేసారు.
తమన్నా సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం ఆమె నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఈ నెల 18న విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఆమె హిందీలో హిమ్మత్ వాలా చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే జులాయి చిత్రంతో హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత పవన్ కళ్యాణ్‌తో సినిమాకు సిద్ధమవుతున్నారు.


Click it and Unblock the Notifications











