తమన్నా అందాల చాటున వ్యాపారం (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: గ్లామర్ లేనిదే ఇప్పుడు ఏ కార్పొరేట్ వ్యాపారం సాగే పరిస్థితి కనిపిచడం లేదు. అందుకే తమ తమ వ్యాపారానికి అనుగుణంగా సినిమా తారాలను ఎంచుకుని వారితో తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నారు. 'Joh Rivaaj' అనే సారీ బ్రాండ్ తరుపున ప్రచారం చేయడానికి హీరోయిన్ తమన్నా ఆ మధ్య డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా నార్త్ ఇండియాకు చెందిన ఈ బ్రాండ్ ఉత్పత్తులను సౌతిండియాలోనూ ప్రవేశ పెట్టడంలో భాగంగా ప్రచార కార్యక్రమానికి తెరలేపారు నిర్వాహకులు. ఈ మేరకు తమన్నాతో పాటు, పలువురు అందమైన మోడల్స్‌తో హైదరాబాద్‌లోని వెస్టిల్ హోటల్ వేదికగా ర్యాంప్ వాక్ నిర్వహించారు. మోడల్స్ ర్యాంప్ వాక్‌తో ఈ కార్యక్రమం సందడిగా సాగింది.

'Joh Rivaaj' సారీ బ్రాండ్‌కు తమన్నా ప్రచారం చేయబోతోంది. ఇందుకోసం అమ్ముడు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నేట్లు సమాచారం. తమన్నా వంటి అందమైన హీరోయిన్ తమ సారీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా నియమించుకోవడం వల్ల వ్యాపారం పెరుగు మరింత పెరుగుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఆ బ్రాండ్ ఉత్పత్తి దారులు.

తమన్నా పాపులారిటీ

తమన్నా పాపులారిటీ


తమన్నాకు దక్షిణాదిన మంచి పాపులారిటీ ఉంది. దీంతో పాటు అమ్ముడు మధ్య పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ద్వారా దేశ వ్యాప్తంగా తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవచ్చనేది ఉత్పత్తి దారుల ఆలోచనగా కనిపిస్తోంది.

జో రివాజ్ గురించి తమన్నా

జో రివాజ్ గురించి తమన్నా


జో రివాజ్ తరుపున ప్రచారం చేయడం చాలా సంతోషకరమైన ఎక్స్ పీరియన్స్ అని, జో రివాజ్ వారి కలెక్షన్స్ లో ప్రతి గర్ల్స్ ఒక అందమైన బొమ్మాలా తయారవచ్చని తమన్నా అంటోంది.

తమన్నా సినిమాల విషయానికొస్తే...

తమన్నా సినిమాల విషయానికొస్తే...


పలు సౌత్ ప్రాజెక్టులతో పాటు, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ సాజిద్-పర్హాద్ ‘ఇట్స్ ఎంటర్టెన్మెంట్స్' చిత్రంతో పాటు, సాజిద్ ఖాన్ ‘హమ్ షకల్' చిత్రంలో నటిస్తోది.

మహేష్ బాబుతో ఆగడు

మహేష్ బాబుతో ఆగడు


సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం తొలిసారి దక్కించుకున్న తమన్నా...ప్రస్తుతం సినిమా షూటింగులో బిజీగా గడుపుతోంది.

జో రివాజ్ ఫ్యాషన్ షో

జో రివాజ్ ఫ్యాషన్ షో


జో రివాజ్ సంస్థ ప్రచారంలో భాగంగా పలువురు ముంబై మోడల్స్ పాల్గొని తమ అందచందాలతో జోరివాజ్ సారీలకు మరింత వన్నె తెచ్చారు.

బ్రాండ్ ప్రమోషన్‌కు భారీ ఖర్చు

బ్రాండ్ ప్రమోషన్‌కు భారీ ఖర్చు


బ్రాండ్ ప్రమోషన్ కోసం ఉత్పత్తి దారులు భారీగా ఖర్చు చేస్తున్నారు. పబ్లిసిటీ పెరిగితేనే వ్యాపారం బాగా సాగుతుందనేది వారి ఆలోచన.

హైదరాబాద్ మార్కెట్

హైదరాబాద్ మార్కెట్


హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో డిజైనర్ శారీలపై మోజు పెరిగింది. అలాంటి చీరల కోసం ఎన్ని వేలయినా ఖర్చు పెట్టడానికి మహిళలు వెనకాడటం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X