తమన్నా చేత ఫ్రీగా చేయించుకోవాలంటే ఇదే మార్గం
'హ్యాపీడేస్" 'కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం" చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ఇప్పుడు నటనకు అవకాశం ఉన్న పాత్రలు కావాలంటోంది. తాను నటించిన తమిళ చిత్రాలన్నీ దాదాపు మంచి నటిగా ప్రూవ్ చేశాయి...కానీ తెలుగులోనే సరైన చిత్రం ఒక్కటీ పడలేదని చాలా బాధ పడిపోతోంది. అందుకే తనకు జ్యోతిక చేసిన 'చంద్రముఖి" లాంటి చిత్రం ఒకటి కావాలని తెలిసిన డైరెక్టర్లందరినీ అడుగుతోంది. అలాంటి చిత్రాల్లో అయితే రెమ్యునేషన్ కూడా తీసుకోకుండా నటిస్తానంటోంది. కాబట్టి ఆమె చేత ప్రీగా చేయించుకోవాలంటే వెంటనే చద్రముఖి సీక్వెల్ లో లేక ఫ్రీక్వెలో అదీ కాకపోతే చంద్రముఖి కి ఈక్వెల్ సబ్జెక్టు పట్టుకెళితే సరి. ఇక తమన్నా ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన బద్రీనాధ్ చిత్రంలోనూ నాగచైతన్య,సుకుమార్ కాంబినేషన్ సినిమాలోనూ చేస్తోంది. అలాగే ఈ చిత్రంలో మహలక్ష్మిగా తమన్నా కనిపించనుంది. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. గ్యారెంటీగా ఈ చిత్రం చూసిన వారు ప్రెష్ గా ఫీలవుతారు అని చెప్తున్నారు. యువతకు నచ్చే స్టైలింగ్, మ్యానరిజమ్స్ ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











