తమన్నా తెలివికి షాక్ అవుతున్నారు
సౌత్ పరిశ్రమపై కామెంట్ చేసి తలనొప్పి తెచ్చుకున్న కాజల్ ని చూసి తమన్నా బుద్ది తెచ్చుకున్నట్లుంది. అందుకే చాలా తెలివిగా మీడియా వద్ద మాట్లాడుతోంది.ఆమె మాటలు,పరిణితి చూసి ఆమెతో పనిచేసినవారు షాక్ అవుతున్నారు. ఈ విషయం రీసెంట్ గా ఆమె అన్న మాటలు బట్టి అర్దం చేసుకోవచ్చు. ఇంతకీ ఆమె ఏమన్నది అంటే..తమిళ సినిమాకు నేనేం దూరంగా లేను. నన్ను 'నటి"గా నిలబెట్టింది తెలుగు సినిమా అయితే... నన్ను 'స్టార్"ని చేసింది తమిళ సినిమా.ఈ రెండూ నాకు రెండు కళ్లు లాంటివి. కాకపోతే తెలుగులో 'సక్సెస్" అయితే సాధించగలిగాను కానీ, అనుకున్న స్థాయిలో ప్రజాదరణ పొందలేకపోయాను. ఇది నేను వెలితిగా భావించే అంశం. అందుకే.. ఎలాగైనా తెలుగులో ప్రూవ్ చేసుకోవాలనేది నా తపన. గతంలో తెలుగులో చాలా అవకాశాలొచ్చినా, తమిళంలో బిజీ వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు తెలుగులో బిజీగా ఉండటం వల్ల తమిళంలో చేయలేకపోతున్నాను. దాన్ని వక్రీకరిస్తే ఎలా?""అంటూ తెలివిగా ప్రశ్నించింది తమన్నా. తమన్నా ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్ లతో తమన్నా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











