నా ఫస్ట్ ఫ్రిఫరెన్స్ దానికే...:తమన్నా
తమన్నా సినిమా కెరీర్ తెలుగు చిత్రసీమతోనే ప్రారంభం అయింది. ముందు కొన్ని ఫ్లాప్స్ ఆయన తర్వాత గాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ గా మారిపోయింది తమన్నా. కోటి రూపాయలు తీసుకుంటున్న కొద్దిమంది హీరోయిన్స్ లో తమన్నా కూడా ఉంది. కథ, డబ్బు రెండిట్లో ఏది ముఖ్యం అంటే, తనకి కథ, తన పాత్ర ముఖ్యం అని , డబ్బు కోసం ఏవి పడితే అవి ఒప్పుకోను అని చెప్పుకొచ్చింది. అంతే కాదు గ్లామర్ ఫీల్డ్ కాబట్టి గ్లామర్ చూపించడంలో తప్పులేదని కాని 2 పీస్ బికిని రేంజ్ కి ఇంకా దిగజార లేదని చెప్పింది. గ్లామర్ షోకి తనకంటూ కొన్ని హద్దులు ఉన్నాయని అవి దాటలేను అని చెప్పింది.
అంతే కాదు తెలుగులో ఇప్పుడు వరుసగా 4 సినిమాలతో బిజీ గా ఉన్న తమన్నా తమిళ సినిమాలు చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది అంది. ఏమైనా నా మొదటి ప్రాధాన్యం తెలుగు సినిమానే ఎందుకంటే ఇక్కడే నేను హీరోయిన్ గా నా కెరీర్ మొదలు పెట్టాను అని తన కృతజ్ఞతని తెలిపింది. తమన్నాకి అటు కోలీవుడ్ లో కూడా భారీగా డిమాండ్ ఉంది, ఎన్నో ఆఫర్స్ వస్తున్నా కాని వేటికి 'ఎస్" చెప్పడం లేదు.
ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా వివాదాల జోలికి పోకుండా తన పని తను చేసుకుంటుంది తమన్నా. ఒకటి రెండు హిట్స్ రాగానే కొంత మంది హీరోయిన్స్ కి కొమ్ములు వచ్చేస్తున్న ఈ రోజుల్లో తమన్నాలా ఉండటం చాలా కష్టం అనేది వాస్తవం. అంతే కాదు హీరోలు, డైరెక్టర్ లు కూడా తమన్నా తో పని చెయ్యడానికి ఇష్టపడతారని ఇండస్ట్రీలో టాక్....


Click it and Unblock the Notifications











