రెండు డిజాస్టర్ల తర్వాత.. ఆ టైంలో రాజమౌళిగారు వస్తే అందుకేమో అనుకున్నా.. తమన్నా!

బాహుబలి చిత్రం తెలుగు సినిమా సత్తాని ప్రపంచ స్థాయిలో తెలిసేలా చేసింది. అంతే కాదు ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు లభించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలపై జాతీయ స్థాయిలో క్రేజ్ తీసుకొచ్చిన చిత్రం బాహుబలి. భారత సినిమా చరిత్రలో బాహుబలి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ క్రేజీ ప్రాజెక్టు లో ప్రభాస్ సరసన తమన్నా అవంతిక పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ బాహుబలి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంది.

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా

తమన్నా తక్కువ సమయంలోనే సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. అభిమానులు తమన్నాని ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటున్నారు. సౌత్ లోని స్టార్ హీరోలు మహేష్, పవన్, రాంచరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అందరి సరసన నటించింది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలోనే బాలీవడ్ లో కూడా స్టార్ గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

 రెండు డిజాస్టర్లు

రెండు డిజాస్టర్లు

తాజాగా బాహుబలి చిత్రం గురించి మాట్లాడుతూ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ జోరు తగ్గిన సమయంలో బాహుబలిలో నటించే అవకాశం వచ్చిందని తమన్నా తెలిపింది. బాహుబలి చిత్రం ప్రారంభమయ్యే సమయానికి నేను నటించిన బాలీవుడ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఆ రెండు పెద్ద సినిమాలే అని హిమ్మత్ వాలా, హమ్ షకల్స్ చిత్రాల గురించి ప్రస్తావించింది. ఆ రెండు సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి.

ఏడాదిన్నర తర్వాత

ఏడాదిన్నర తర్వాత

రెండు డిజాస్టర్లతో నా కెరీర్ బాగా తగ్గిపోతున్న సమయంలో రాజమౌళి సర్ నన్ను కలిశారు. అప్పటికి బాహుబలి షూటింగ్ ప్రారంభమై ఏడాదిన్నర గడచిపోయింది. పైగా బాహుబలి చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు అన్ని భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్లాపుల్లో ఉన్న నాకు బాహుబలిలో హీరోయిన్ గా అవకాశం రాదు అని అనుకున్నా. రాజమౌళి గారు నన్ను కలవడానికి వచ్చినప్పుడు గెస్ట్ రోల్ కోసం మాట్లాడడానికి వచ్చారేమో అనుకున్నా అని తమన్నా తెలిపింది. కానీ నాకు బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రలో నటించే అద్భుత అవకాశం వచ్చిందని తమన్నా తెలిపింది.

 అందమైన పాత్ర

అందమైన పాత్ర

అవంతిక అనేది చాలా అందమైన పాత్ర. బహుశా హీరోయిన్ల కోసం ఇండియన్ సినిమాలోనే అలాంటి అందమైన పాత్రని ఎవరూ సృష్టించలేదు. నాపై నమ్మకం ఉంచి ఆ అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి ఎప్పటికి రుణపడి ఉంటాను అని తమన్నా తెలిపింది. తమన్నా ప్రస్తుతం క్వీన్ రీమేక్ డట్ ఈజ్ మహాలక్ష్మి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X