ఒక్క క్షణమైనా ఎంజాయ్ చేస్తున్నానంటే.. మీ వల్లే.. తమన్నా షాకింగ్ కామెంట్

ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త, రాజకీయవేత్త డా.టి. సుబ్బిరామిరెడ్డి. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ను సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. బుధవారం రాత్రి పార్క్ హయత్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించిన సుబ్బిరామిరెడ్డి.. 'సైరా' బృందాన్ని సన్మానించి అభినందించారు.

తమన్నా మాట్లాడుతూ..''సుబ్బిరామిరెడ్డి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే.. మా డైరెక్టర్ సురేందర్‌రెడ్డి గారిని గెడ్డం లేకుండా క్లీన్ షేవ్‌లో చూసే అవకాశం కల్పించారు. ఇలా అందరినీ ఈ వేదికపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది. మంచి సినిమాలకు సుబ్బిరామిరెడ్డి గారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్‌గా ట్రీట్ చేస్తారు.

 Tamannaah Bhatia about Sye Raa movie success

ఈ రోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే సుబ్బిరామిరెడ్డిగారే కారణం. నా బిజీ షెడ్యూల్‌లో కూడా ఇక్కడకు వచ్చేలా సపోర్ట్ చేసిన సుబ్బిరామిరెడ్డి గారికి చాలా థ్యాంక్స్. సినిమా సక్సెస్ అయ్యాక దాన్ని ఎంజాయ్ చేయడానికి కదరదు. ఈ రోజు ఒక్క క్షణమైనా ఆ ఎంజాయ్‌మెంట్ పొందుతున్నానంటే అది మీ వల్లే. సో థ్యాంక్యూ సోమచ్ టు సుబ్బిరామిరెడ్డి గారు. ఈ సినిమాలో నటించే గొప్ప అదృష్టాన్ని కల్పించిన సురేందర్‌రెడ్డి, రామ్ చరణ్, చిరంజీవి గారికి చాలా పెద్ద థ్యాంక్స్.'' అన్నారు.

ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు విక్టరీ వెంకటేశ్, జీవిత రాజశేఖర్ దంపతులు, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, ఛార్మి, కేథరిన్, నిహారిక, అశ్వినీదత్, బోనీకపూర్, సురేష్ బాబు, డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, క్రిష్,సుకుమార్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, రాజకీయ నాయకులు రఘురామ కృష్ణంరాజు, మురళీమోహన్, కేవీపీ, పీవీపీ, సీఎం రమేష్, దానం నాగేందర్, జేసీ పవన్‌రెడ్డి, క్రీడారంగం నుంచి చాముండేశ్వరినాథ్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సన్‌షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి చిరంజీవి మీద అభిమానంతో 'సైరా' ప్రత్యేక కేక్‌ను తయారు చేయించి మెగాస్టార్‌కు బహూకరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X