శృంగారభరిత సన్నివేశాల్లో.. ఆ దర్శకుడు నాతో తప్పుగా ప్రవర్తించలేదు.. తమన్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా మరోమారు శృంగారభరిత, ముద్దు సన్నివేశాల గురించి మాట్లాడింది. ఆ సన్నివేశాల్లో నటించే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పేసింది. తన 15 ఏళ్ల సినీ కెరీర్ గురించి తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హ్యాపీడేస్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా అందం, అభినయంతో కుర్రాళ్లని అభిమానులుగా మార్చుకుంది. తక్కువ సమయంలో తమన్నా సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. బాలీవుడ్ తనకు ఎదురైన అనుభవాలు, మీటూ ఉద్యమం గురించి తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కెరీర్ మొదట్లోనే చెప్పా

కెరీర్ మొదట్లోనే చెప్పా

తాను శృంగారభరిత, ముద్దు సన్నివేశాలలో నటించానని కెరీర్ ఆరంభంలోనే చెప్పా. ఆ మాటకే కట్టుబడి ఉంటా. ఇక మీదట కూడా నటించానని తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తనకు బాలీవుడ్ కన్నా సౌత్ లోనే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని తమన్నా తెలిపింది. ఇప్పుడు కథాబలం ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తే బావుంటుందని అనిపిస్తోంది.

తప్పుగా ప్రవర్తించలేదు

తప్పుగా ప్రవర్తించలేదు

గత ఏడాది తనుశ్రీ దత్తా వలన బాలీవుడ్ లో మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున చెలరేగిన సంగతి తెలిసిందే. పలువురు దర్శకులు, నిర్మాతలు, నటులపై లైగింక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ జాబితాలో దర్శకుడు షాజిద్ ఖాన్ పేరు కూడా ఉంది. షాజిద్ ఖాన్ దర్శత్వంలో తమన్నా రెండు చిత్రాల్లో నటించింది. ఆయన దర్శత్వంలో వచ్చిన హిమ్మత్ వాలా, హంషకల్స్ చిత్రాలు నిరాశపరిచాయి. షాజిద్ ఖాన్ మాత్రం తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని తెలిపింది. ఆయన దర్శత్వంలో పనిచేయడం తనకు బాగా అనిపించిందని తమన్నా పేర్కొంది.

 అదే నాకు ముఖ్యం

అదే నాకు ముఖ్యం

సినిమా కథ, ఆ కథకు న్యాయం చేసేలా మనం పెర్ఫామ్ చేస్తున్నామా లేదా..నాకు ఇదే ముఖ్యం. మిగిలిన విషయాలు నేను పట్టించుకోను. షాజిద్ ఖాన్ నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. మీటూ అనేది కేవలం చిత్ర పరిశ్రమలోనే కాదు.. అన్ని రంగాల్లో ఉందని తమన్నా తెలిపింది. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ తనకు ఇప్పట్లో ఆ ఆలోచన లేదని తెలిపింది. సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది అని పేర్కొంది.

బలవంతపెట్టరు

బలవంతపెట్టరు

శృంగార సన్నివేశాలు, ముద్దు సన్నివేశాల్లో నటించాలని ఎవరూ బలవంత పెట్టరు. అది మన ఛాయిస్. ఆ సీన్స్ లో నటించకూడదు అని నేను ముందు నుంచి నిర్ణయించుకున్నా. ఎవరైనా శృంగార సన్నివేశాల్లో నటించమని బలవంత పెడుతున్నట్లు చెబితే అందులో అర్థం ఉండదని తమన్నా తెలిపింది. మనకు ఇష్టం లేకుంటే పక్కకు తప్పుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇండస్ట్రీలో మనకు తెలియకుండా ఏదీ జరగదని తమన్నా తెలిపింది. ప్రస్తుతం తమన్నా సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో, దట్ ఈజ్ మహాలక్ష్మిలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X