Odela 2 Budget: తమన్నాపై అన్ని కోట్ల బడ్జెటా? ఓదెల 2 లాభాల్లోకి రావాలంటే?
తెలుగు సినిమాని ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్స్ లో ప్రస్తుత జెనరేషన్ కి మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కనిపిస్తుంది. కాగా తమన్నా తెలుగులో సహా తమిళ్ లో కూడా ఎన్నో సినిమాలు తన యంగ్ ఏజ్ నుంచే చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఆనతి కాలంలో స్టార్ హీరోస్ సరసన సినిమాలు చేసే ఛాన్స్ పట్టేసిన తమన్నా కొన్నాళ్ళు అయితే తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాది సినిమా నుంచే బ్రేక్ తీసుకుంది.
కొత్త హీరోయిన్స్ పోటీ కూడా ఎక్కువ కావడంతో ఒక టైం లో బీ గ్రేడ్ రేంజ్ వెబ్ సిరీస్ లు చేసుకునే స్థితికి తమన్నా వెళ్ళింది. కాగా ఫైనల్ గా కొన్నాళ్ల తర్వాత మళ్ళీ ఫుల్ లెంగ్త్ పాత్రలో అది కూడా తన పైనే నడిచే సినిమాతో తెలుగులో మళ్ళీ రచ్చ చేసేందుకు వస్తుంది. కాగా ఆ చిత్రమే "ఓదెల 2".

ఆల్రెడీ తమన్నాతో వర్క్ చేసిన దర్శకుడు సంపత్ నంది కలయికలో చేసిన ఈ హారర్ ఫాంటసీ సినిమా నిజానికి చాలా కాలంగా తెరకెక్కుతుంది. మొదట్లో పెద్దగా దీనికోసం ఎవరూ పట్టించుకోలేదు కానీ ఫైనల్ గా మేకర్స్ మాత్రం కొంచెంలో కొంత అయినా బజ్ తెచ్చుకున్నారు. కాగా ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలే సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
తమన్నా దాదాపు తెలుగు సినిమా దగ్గర అవుట్ డేటెడ్ అయిపోయినప్పటికీ ఈమెని, ఈ సినిమా కథని నమ్మి భారీ మొత్తంలోనే బడ్జెట్ ని మేకర్స్ పెట్టారట. సినీ వర్గాల్లో టాక్ ప్రకారం ఓదెల 2 కోసం మేకర్స్ ఏకంగా 25 కోట్లు బడ్జెట్ ని పెట్టారట. ఈ సినిమాలో నటీనటులు ఒక్క తమన్నా మినహా పెద్ద తారాగణం లేదు కానీ సినిమా సెట్టింగ్స్ కానీ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం మాత్రం ఎక్కువ ఖర్చు అయ్యిందట.
అందుకే ఈ సినిమాకి ఈ మేర బడ్జెట్ అయ్యిందట. కాగా ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ రేంజ్ లోనే బిజినెస్ తో మేకర్స్ మొత్తం రాబట్టేసుకున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. బడ్జెట్ 25 కోట్లు అయితే వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు 10 కోట్ల మేర అమ్ముడుపోతే ఇవి కాకుండా ఆడియో సహా ఓటిటి హక్కులు కలిపి మరో 18 కోట్లకి అమ్ముడుపోయాయట.
దీనితో కేవలం ఈ హక్కులతోనే పెట్టిన బడ్జెట్ కంటే మరో 3 కోట్లు ఎక్కువే మేకర్స్ అందుకున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ నాన్ థియేట్రికల్ గా సినిమా వర్క్ అయినప్పటికీ థియేట్రికల్ గా కూడా సినిమా బాగా ఆడితే తప్ప నిర్మాతలకి ఫుల్ ఫ్లెడ్జ్ గా మనశ్శాంతి దక్కకపోవచ్చు. దీనితో ఈ టెన్షన్ మాత్రం మేకర్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఓదెల 2 ఈ అంచనాలు రీచ్ అవుతుందా లేదా అనేది ఈ ఏప్రిల్ 17 వరకు ఆగితే తెలిసిపోతుంది. కాగా ఇవి పక్కన పెడితే తమన్నా రీసెంట్ గానే మరో ఐటెం సాంగ్ కి ఓకే చెప్పినట్టుగా కూడా సమాచారం.


Click it and Unblock the Notifications











