Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాజు గారి గది 3 కోసం స్టార్ హీరోయిన్!
ఓంకార్ దర్శత్వంలో తెరకెక్కిన రాజు గారి గది చిన్న చిత్రంగా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ఓంకార్ సోదరుడు అశ్విన్ ప్రధాన పాత్రలో నటించాడు. ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం అందించిన స్పూర్తితో ఓంకార్ రాజు గారి గది 2ని కూడా తెరకెక్కించాడు. నాగార్జున, సమంత, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం విజయం సాధించలేదు. కానీ ఓంకార్ దర్శత్వంకు ప్రశంసలు దక్కాయి.
పెళ్లి గురించి నా జాతకంలోనే అలా ఉంది.. అలీతో తన లైఫ్ సీక్రెట్స్ చెప్పిన కరాటే కళ్యాణి!
ప్రస్తుతం ఓంకార్ రాజుగారి గది 3కి కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నాని ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం దర్శకుడు కలిశాడట. ఈ చిత్రాన్ని ఓంకార్ లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. తమన్నా అయితే లీడ్ రోల్ కు సరిపోతుందని ఓంకార్ భావిస్తున్నాడు. తమన్నా ఈ చిత్రంలో నటించే విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఎఫ్2 చిత్రంతో తిరుగులేని విజయాన్ని అందుకున్న తమన్నా.. మళ్ళీ గ్లామర్ రోల్సే కోరుకుంటుందా లేక లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం రాజుగారి గది 3 ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.