For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తడిపొడిగా స్విమ్ సూట్ లో తమన్నా (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : తెలుగు,తమిళ భాషల్లో హాట్ హీరోయిన్ ఎవరూ అంటే ఆలోచించుకుంటూ మిల్కీ బ్యూటీ తమన్నా పేరే చెప్తారు. అతి కొద్ది కాలంలోనే ఇటు తెలుగు అటు తమిళ భాషల్లో 'మోస్ట్ వాంటెడ్' హీరోయిన్‌గా మారిపోయింది. ఈ పాల బుగ్గల సుందరికి తమిళనాడులో గుడి కట్టినంత పని చేశారు కొంతమంది ఫ్యాన్స్ . అయితే ఆమె ఎప్పుడూ అందాల ప్రదర్శనల్లో హద్దుదాటటానికి ప్రయత్నించలేదు.

  కానీ రోజు రోజుకీ పోటీ పెరుగుతోంది. కొత్త హీరోయిన్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతున్నారు. ఈ నేపధ్యంలో కొద్దిగా ఆమె కండిషన్స్ సడలించుకుని దర్శక,నిర్మాతలకు సహకరిస్తోంది. తనను తాను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టకోవటానికి చేసే ప్రయత్నాలు అన్నీ చేస్తోంది. తనకు 'హ్యాపీడేస్' రూపంలో బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్‌ని ఇష్టపడినట్లుగానే కోలీవుడ్‌ని కూడా ఇష్టపడతారు తమన్నా.

  అలాగే తమన్నాకు మొదటనుంచీ బాలీవుడ్ ఆఫర్స్ మీదే ఆసక్తి ఉంది. అయితే అవి కలిసిరాకపోవటమే కాక కోర్టు కేసులతో వివాదంలో సైతం ఆమెను దింపాయి. ఆమె తొలి బాలీవుడ్ చిత్రం ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. దాంతో సౌత్ మీద ఆమె దృష్టి పెట్టి ఇక్కడ పెద్ద హీరోలందరితో చేసింది. ఇప్పుడు హిమ్మత్ వాలాతో మళ్లీ బాలీవుడ్ బరిలోకి దూకుతోంది.

  తమన్నా గతంలో రచ్చ, ఆవారా చిత్రంలో వానపాటల్లో నటించి తన అందచందాలతో ప్రేక్షకులకు మంచి కిక్కెక్కించింది. తాజాగా తడాఖా చిత్రంలో కూడా తమన్నా అదే రేంజిలో రెచ్చిపోతుండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని దర్శకనిర్మాతలు నమ్ముతున్నారు.

  పుట్టిపెరిగింది ముంబయిలో. నాన్న సంతోష్‌ భాటియా. అమ్మ రజని. అన్నయ్య ఆనంద్‌. పదో తరగతి వరకు జుహూలోనే చదువుకొన్నా. ముందునుంచీ సినిమాలంటే చెప్పలేనంత ఇష్టం. టీవీలో వచ్చిన సినిమాలు చూడటం, అందులో హీరోయిన్లలా తయారై రోజంతా ఆ పాత్రలో నన్ను నేను వూహించుకోవడం, అదే పేరు పెట్టుకోవడం తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. ఇంట్లో అమ్మను కూడా అలాగే పిలవమని చెప్పేదాన్ని.

  ఓసారి మా స్కూల్‌ యాన్యువల్‌ డే ఫంక్షన్‌లో పాల్గొన్న నన్ను చూసి ఓ దర్శకుడు 'నటిస్తావా' అని అడిగారు. అలా పదమూడేళ్ల వయసులోనే ఫెయిర్‌ అండ్‌ లవ్లీ ప్రకటనలో కనిపించా.

  ఆ తరవాత హిందీ సినిమా 'చాంద్‌సా రోషన్‌ చెహ్రా'లో చేశా. అదే ఏడాది తెలుగులో 'శ్రీ'లోనూ అవకాశం వచ్చింది.

  ఆ తరవాత తమిళంలో మూడు సినిమాలు చేశాక 'హ్యాపీడేస్‌'తో మళ్లీ తెలుగులోకి వచ్చా. ఆ సినిమా తరవాత చెప్పేదేముంది... వరుస అవకాశాలతో అటు తమిళం, ఇటు తెలుగులో బిజీ బిజీ.

  నేను చేసిన వాటిలో బాగా నచ్చిన పాత్రంటే 100% లవ్‌లో మహాలక్ష్మే. అందులోలానే చికెన్‌ అంటే పడి చస్తా.

  బద్రినాథ్‌లో నా డ్యాన్స్‌ చూసి అల్లుఅర్జున్‌ మెచ్చుకోవడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

  'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' చేస్తున్నప్పుడు విలేకరి ఇంత కష్టపడతాడా అనిపించింది.

  నాకు ఇష్టమైన సినిమాలు: దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే, మొఘల్‌ ఏ ఆజం. ఈ రెండూ ఎన్నిసార్లు చూశానో చెప్పక్కర్లేదు. తెలుగులో అయితే ఆనంద్‌.

  నాకు నచ్చిన హీరోయిన్స్ ...మాధురీదీక్షిత్‌, ప్రీతీజింతా

  'తడాఖా' చిత్రానికి తెలుగులో కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా నాగచైతన్య, తమన్నా, సునీల్, ఆండ్రియా జెర్మయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  English summary
  Tamanna Bhatia entered into her teens and movies at the same time and has worked in some successful Tamil and Telugu movies.
 She also has experience as a model and has appeared in ads for Rajmahal Silks, Saravana Stores and Shakti Masala.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X