Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అడ్డంగా బుక్కైన తమన్నా.. పాపం! ఊహించని పరిణామం.. షాకింగ్
సెలెబ్రిటీలు అన్నాక కొత్త కొత్త చిక్కులు, ట్రోలింగ్స్ పాలవడం కామన్‌గా జరిగేదే. కానీ మిల్కీ బ్యూటీ తమన్నాకు మాత్రం ఊహించని రీతిలో షాకులు తగులుతున్నాయి. బిగ్ బాస్ రూపంలో ఆమెను కష్టాలు వెంటాడుతున్నాయి. బిగ్ బాస్ షోతో ఏమాత్రం సంబంధం లేకపోయినా తమన్నా పడుతున్న కష్టాలు చూస్తుంటే ఎవ్వరైనా అయ్యో పాపం! అనాల్సిందే. ఇంతకీ తమన్నాకు వచ్చిన ఆ కష్టం ఏమిటి? తమన్నా నిజంగానే షాక్‌లో ఉందా? వివరాల్లోకి పోతే..
తమన్నా కష్టానికి కారణం తమన్నానే..
ప్రస్తుతం చెప్పుకోలేని బాధ పడుతున్న తమన్నా కష్టానికి కారణం మరో తమన్నా. అదేనండీ అర్థం కాలేదా.. బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి. ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి బిగ్ బాస్ హౌస్‌లో ఎంటరయ్యాక మిల్కీ బ్యూటీ తమన్నా కష్టాలు స్టార్ట్ అయ్యాయట.
అడ్డంగా బుక్.. ఓపెన్ చేయాలంటేనే భయం భయం
తమన్నా సింహాద్రి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో.. అప్పటి నుంచి హీరోయిన్ తమన్నా ట్విటర్ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారట నెటిజన్లు. బిగ్ బాస్‌లో తమన్నా సింహాద్రి చేస్తున్న పనులను ఉద్దేశిస్తూ మిల్కీ బ్యూటీకి లక్షల కొద్ది ట్వీట్స్ వస్తున్నారట. దీంతో తన ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయాలంటేనే వణికి పోతోందట తమన్నా.
పెద్ద ఎత్తున నెగెటివ్ ట్వీట్లు.. అయ్యో పాపం
అలా వస్తున్న ట్వీట్ల ప్రవాహంలో పెద్ద ఎత్తున నెగెటివ్ ట్వీట్లు కూడా ఉండటంతో ఏం చేయాలో అర్ధంకానీ స్థితిలో ఉందట మిల్కీ బ్యూటీ తమన్నా. తమన్నా సింహాద్రి బిగ్‌బాస్‌లో కొనసాగినంత కాలం హీరోయిన్ తమన్నాకు ఈ ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు తమన్నా అభిమానులు. ఇక ఈ ఉదంతం చూసి అయ్యో పాపం తమన్నా! అనడం ఇంకేం చేయగలం మీరే చెప్పండి అంటున్నారు మేధావులు.
హౌస్‌లో గొడవలు.. తమన్నా సైతం
ఇక మరోవైపు బిగ్ బాస్ హౌస్ లోకి తమన్నా వచ్చాక హౌస్‌లో గొడవలు ఎక్కువయ్యాయి. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తమన్నా సింహాద్రి సైతం తనకు నచ్చని వారిని టార్గెట్ చేస్తూ రివేంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా రవికృష్ణను టార్గెట్ చేస్తూ 'పప్పు.. పవర్ లేని పప్పూ' ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.