విరాట్ కోహ్లీ మంచి నటుడు.. అప్పుడే వదిలేశా.. రూమర్స్‌పై తమన్నా ఎట్టకేలకు!

Recommended Video

Tamannaah Finally Opens Up About Dating With Virat Kohli | Filmibeat Telugu

మిల్కీ బ్యూటీ తమన్నాకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. గ్లామర్ తోపాటు, మంచి నటనతో తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అవసరమైనప్పుడు ఈ మిల్కీ బ్యూటీ అందాలు ఆరబోయడానికి కూడా వెనుకాడదు. ఇటీవల వెంకటేష్ సరసన ఎఫ్2 చిత్రంలో నటించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా కొనసాగుతూనే అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తోంది తమన్నా. ఇటీవల తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విరాట్ కోహ్లీతో తనకు రిలేషన్ ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది.

వాణిజ్య ప్రకటనల్లో

వాణిజ్య ప్రకటనల్లో

సినీ తారలు, స్పోర్ట్ స్టార్స్ మధ్య ప్రేమ చిగురించే సంఘటనలు చాలా జరిగాయి. యువరాజ్ సింగ్, దీపికా.. విరాట్, అనుష్క శర్మ ఇలా చాలా ప్రేమ కథలు సాగాయి. వాటిలో కొన్ని మాత్రమే పెళ్లివరకు వెళ్లాయి. మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో కూడా సినీ హీరోయిన్లు, క్రికెటర్స్ కలసి నటిస్తుంటారు. విరాట్, అనుష్క శర్మ మధ్య ఇలాగే ప్రేమ చిగురించింది. తమన్నా, విరాట్ కోహ్లీ కూడా ఐదేళ్ల క్రితం ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు.

డేటింగ్ రూమర్స్

డేటింగ్ రూమర్స్

తమన్నా, విరాట్ కలసి యాడ్ లో నటించినప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించిందని రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరూ కలసి డేటింగ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో తమన్నా ఈ వార్తలపై స్పందించలేదు. కాగా ఐదేళ్ల తర్వాత తాజాగా తమన్నా విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసినట్లు వచ్చిన రూమర్స్ పై పెదవి విప్పింది. ఆ వార్తలు అసత్యం అని కొట్టిపారేసింది. విరాట్ కోహ్లీతో తనకున్న పరిచయం ఎలాంటిదో తమన్నా వివరించింది.

నాలుగు మాటలే

నాలుగు మాటలే

నేను, విరాట్ కోహ్లీ యాడ్ లో నటించిన విషయం అందరికి తెలుసు. అంతకు మించి మా మధ్య ఇంకేమీ లేదు. మేమిద్దరం కనీసం నాలుగు మాటలు కూడా మాట్లాడుకోలేదు. ఆ యాడ్ షూట్ తోనే మా పరిచయం కూడా ముగిసిపోయింది. ఆ తర్వాత ఏ సందర్భంలో కూడా విరాట్ కోహ్లీని కలవలేదు, మాట్లాడలేదు అని తమన్నా క్లారిటీ ఇచ్చింది. అలాంటప్పుడు ఇక డేటింగ్ ఎలా చేస్తాం అని తమన్నా తెలిపింది.

 మంచి నటుడు

మంచి నటుడు

కానీ నేను కలసి నటించిన చాలా మంది నటులకన్నా కోహ్లీ బెటర్ యాక్టర్ అని కితాబిచ్చింది. ఇక విరాట్, అనుష్క శర్మ కలసి యాడ్స్ లో నటించారు. ఈ సందర్భంగా వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2017లో విరాట్, అనుష్క వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమన్నా ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి, దట్ ఈజ్ మహాలక్ష్మి లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X