Just In
- 9 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 11 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎవరు అదుర్స్?: అతిలోక సుందరితో 'అవంతిక' కి పోలిక
హైదరాబాద్: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా తారాగణంతో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రంలో ఓ ప్రధానపాత్ర పోషిస్తున్న తమన్నా జన్మదినం సందర్భంగా యూనిట్ ఆమె ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. తమన్నా పాత్ర పేరు 'అవంతిక'. యువరాణి పాత్రలో దేవకన్యను తలపిస్తున్న తమన్నా స్టిల్ చిత్రంపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది. అయితే ఈ ఫస్ట్ లుక్ ...జగదేక వీరుడు...అతి లోక సుందరి చిత్రంలో శ్రీదేవిని గుర్తుకు తెచ్చేలా డిజైన్ చేసారని అంతటా వినిపిస్తోంది. అందులో శ్రేదేవి..ఇంద్రుని కుమార్తె ఇంద్రజ గా కనిపించి మురిపించిన సంగతి తెలిసిందే.
https://www.facebook.com/TeluguFilmibeat
ఈ చిత్రంలో ప్రభాస్ ...తండ్రి,కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ..తండ్రి కథను నేరేట్ చేస్తూ సాగుతుంది. తండ్రి పాత్రకు భార్యగా...అనుష్క నటిస్తూండగా...సెకండ్ పార్ట్ లో వచ్చే కొడుకు పాత్రకు గానూ తమన్నా కనిపించనుంది. రానా నెగిటివ్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రమ్యకృష్ణ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ... ‘‘తమన్నా పాత్ర ఈ సినిమాలో చాలా కీలకమైంది. ఆమె ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్‌లో ఉంది. ప్రభాస్, తమన్నాపై అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. బల్గేరియా నుంచి రాగానే రాజమౌళి వాటిని పర్యవేక్షిస్తారు. డాల్బీ అట్మాస్ ఫార్మేట్‌లో పి.ఎం.సతీష్ సౌండ్ మిక్సింగ్ చేస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. 2015 వేసవి కానుకగా బహు భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు.

రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘బాహుబలి' ఫస్ట్ పార్ట్ 2015 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానంది. ఈ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను త్వరగా కంప్లీట్ చేయనున్నారు. సంగీత దర్శకులు యం.యం.కీరవాణి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి' పార్ట్ 1ను ఏప్రిల్ 17, 2015న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పలు భాషలలో డబ్బింగ్ చేయనున్నారు.