చిన్నగా లక్షణాలు మొదలయ్యాయ్.. నా తల్లిదండ్రులకి కరోనా .. తమన్నా పోస్ట్ వైరల్

కరోనా వైరస్ ఎవ్వరినీ వదిలిపెట్టదు. దానికి చిన్నా, పెద్దా అనే తేడాయే ఉండదు. మనం జాగ్రత్తగా ఉండటం తప్పా ఏం చేయలేని పరిస్థితి. అలా కాదు నాకేంటి అనుకుంటే మాత్రం ఏమీ చేయలేం. సీఎం, మంత్రులు, స్టార్ హీరోలు ఇలా ఒక్కరేంటి ఎందరెందరో కరోనా బారిన పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ ముఖ్యంగా సినీ తారల ఇంట్లోనే చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే బిగ్ బీ, రాజమౌళి వంటి బిగ్గెస్ట్ సెలెబ్రిటీల ఇంట్లో కరోనా తాండవం చేసింది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్లో కరోనా సోకిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తమన్నా చెప్పుకొచ్చింది.

మెల్లిగా లక్షణాలు..

మెల్లిగా లక్షణాలు..

గత వీకెండ్ నుంచి మా తల్లిదండ్రులకు చిన్నగా కోవిడ్ 19 లక్షణాలు మొదలయ్యాయ్.. ముందు జాగ్రత్తలో భాగంగా అందరూ పరీక్షలు చేయించుకున్నాం. దాని ఫలితాలు తాజాగా వచ్చాయ్.. దురదృష్ట వశాత్తు మా పేరెంట్స్‌కి పాజిటివ్ వచ్చింది అని తమన్నా తెలిపింది.

 మాకు నెగెటివ్..

మాకు నెగెటివ్..

సంబంధింత అధికారుల ఆదేశాల మేరకు మేమంతా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా తల్లిదండ్రుల ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్‌ను ఇస్తున్నారు. మిగిలిన మా కుటుంబ సభ్యులు, నేను, మా స్టాఫ్ అందరికీ నెగెటివ్ వచ్చింది అని తమన్నా పేర్కొంది.

 మీ ప్రేమా, ప్రార్థనలు..

మీ ప్రేమా, ప్రార్థనలు..

దేవుడి దయ వల్ల మా తల్లిదండ్రులు వైద్యానికి రియాక్ట్ అవుతున్నారు. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, ప్రార్థనల ద్వారా వారు ఇంకా త్వరగా కోలుకునే అవకాశం ఉంది అని తమన్నా చెప్పుకొచ్చింది. ఇక తమన్నా ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే.. కాజల్, సమంత వంటి వారు ఎమోషనల్ అయ్యారు. వారిని జాగ్రత్తగా చూసుకోమని సలహా ఇచ్చారు.

Recommended Video

KGF Star Yash’s Next Movie Update | Filmibeat Telugu
రీసెంట్‌గా ఎంజాయ్...

రీసెంట్‌గా ఎంజాయ్...

రీసెంట్‌గా తమన్నా తన తండ్రి బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించింది. తండ్రిని ప్రేమగా ముద్దుపెట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది తెగ వైరల్ అయింది. ఇక తమన్నా ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తూ వర్కౌట్లు, యోగాలు చేసుకుంటూ లాక్డౌన్ సమయాన్ని బాగా వాడుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X