చేతులు జోడించి నమస్కారం.. గయ్స్ మీరంతా అంటూ తమన్నా!
మీ అందరికీ నా నమస్కారం అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. చేతులు జోడించి నమస్కారం చేస్తున్న తన పిక్ షేర్ చేస్తూ తన ఆనందాన్ని వెల్లడించింది తమన్నా. ఇంతకీ ఆ నమస్కారం ఎందుకంటారా? మెగా మూవీ 'సైరా నరసింహా రెడ్డి' ఆమె ఓ ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పర్‌ఫార్మ్ చేసిన 'ఓ సైరా' వీడియో సాంగ్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకుంటోంది.
దీనికి కృతజ్ఞతగా గైస్ మీ అందరికీ నా నమస్కారం అని రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టేసింది తమన్నా. ఈ మేరకు ఈ వీడియో సాంగ్‌ని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పింది. తమన్నా సింప్లిసిటీ, ఓ సైరా పాటలో ఆమె చూపిన అభినయం పట్ల తమన్నాకు పెద్ద ఎత్తున ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోవైపు ఈ సాంగ్ యూ ట్యూబ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పట్ల ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది.


Click it and Unblock the Notifications











