హృతిక్‌తో ముద్దు, ఛాన్స్ వస్తే సర్జికల్ స్ట్రైక్ హీరోతో ఏకంగా.. తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!
మిల్కీ బ్యూటీ తమన్నా మనసు ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలవైపు మళ్లినట్లు అనిపిస్తోంది. తరచుగా బాలీవుడ్ హీరోల గురించి కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. సౌత్ లో తమన్నా జోరు కాస్త తగ్గింది. తమన్నాకు కుర్రకారులో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి గ్లామర్ రోల్ దొరికితే తమన్నా రెచ్చిపోయి నటిస్తుంది. కానీ ఇటీవల సరైన విజయాలు లేకపోవడంతో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఐటమ్ సాంగ్స్ చేస్తోంది. పనిలో పనిగా బాలీవుడ్ లో కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

మొన్న హృతిక్ రోషన్
కొన్ని రోజుల క్రితం తమన్నా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తమన్నా ఇంతవరకు సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. ముద్దు సన్నివేశాల్లో నటించడం నాకు ఇష్టం లేదు. ఇకపై కూడా నటించకూడదని నిబంధన పెట్టుకున్నట్లు తమన్నా తెలిపింది. కానీ హృతిక్ రోషన్ కు మాత్రం ఆ నిబంధన వర్తించదని, అతడితో నటించే అవకాశం వస్తే ముద్దు సన్నివేశాల్లో కూడా నటిస్తా అని రొమాంటిక్ కామెంట్స్ చేసింది.

విక్కీ నటనకు ఫిదా
తమన్నా తాజాగా మరో బాలీవుడ్ హీరోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. యువ హీరో విక్కీ కౌషల్ 'యురి ది సర్జికల్ స్ట్రైక్' చిత్రంతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. యురి చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లతో సంచలన విజయం సాధించింది. దీనితో చాలా మంది హీరోయిన్లు విక్కీ కౌశల్ సరసన నటించాలని ఆశపడుతున్నారు. తమన్నా మాట్లాడుతూ యురి చిత్రంలో విక్కీ నటనకు ఫిదా అయ్యానని తెలిపింది. ఛాన్స్ వస్తే విక్కీ కౌశల్ తో డేటింగ్ కు వెళ్లాలని ఉన్నట్లు పేర్కొంది. హృతిక్ తో ముద్దు సన్నివేశంలో నటించాలని ఉందని తెలిపిన తమన్నా ఇప్పుడు విక్కీ కౌశల్ తో ఏకంగా డేటింగ్ వెళ్లాలనే తన కోరికని బయటపెట్టింది.

ఆర్మీ మేజర్ పాత్రలో
2016లో ఇండియన్ ఆర్మీపై పాక్ ఉగ్రమూకలు దాడి చేసి 17 మంది సైనికుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఆ తర్వాత పాక్ లోని ఉగ్ర స్థావరాలపై ఇండియా ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ జరిపి ప్రతీకారం తీర్చుకుంది. ఈ అంశాలతో యురి చిత్ర దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించారు. ఆర్మీ మేజర్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుత నటన కనబరిచాడు.

బాలీవుడ్ ప్రయత్నాలు
తమన్నా సౌత్ లో స్టార్ హీరోయినే. కానీ బాలీవుడ్ లో ఆస్థాయి గుర్తింపు ఇంకా తెచ్చుకోలేదు. హంషకల్స్, హిమ్మత్ వాలా లాంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించినా అవి తమన్నాకు గుర్తిపు తీసుకురాలేకపోయాయి. సౌత్ లో అవకాలు కాస్త తగ్గడంతో తమన్నా మరోమారు బాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందువల్లనే తరచుగా బాలీవుడ్ హీరోల గురించి కామెంట్స్ చేస్తోంది. తమన్నా ప్రస్తుతం తెలుగులో డట్ ఈజ్ మహాలక్ష్మి, సైరా నరసింహారెడ్డి లాంటి చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











