బాహుబలి 3 ఆగిపోవడానికి కారణాలు చెప్పిన తమన్నా.. ప్రారంభమై ఉంటే!

Recommended Video

Tamannaah Reveals Why Baahubali 3 Won't Happen

గత ఏడాది విడుదలైన రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి 2 చిత్ర భారతీయ సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. హాలీవుడ్ వర్గాలు సైతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చించుకున్నాయి. బాహుబలి మొదటి భాగంతోనే రెండవ భాగంపై రాజమౌళి ఆసక్తిని పెంచేశాడు. బాహుబలిలో తమన్నా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. మొదటి భాగంలో తమన్నాకు ఎక్కువ సన్నివేశాల్లో నటించే అవకాశం దక్కింది. ఇదిలా ఉండగా బాహుబలి 3 గురించి తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

బాహుబలి 3

బాహుబలి 3

బాహుబలి రెండు భాగాలు విజయం సాధించిన సమయంలో రాజమౌళి బాహుబలి 3 గురించి మాట్లాడారు. భవిష్యత్తులో బాహుబలి ప్రపంచం కొనసాగుతుందని సీక్వెల్ గురించి హింట్ ఇచ్చాడు. సినిమా ముగింపుకూడా బాహుబలి సీక్వెల్స్ కొనసాగుతాయనే విధంగానే ఉంటుంది.

హ్యాపీ ఎండింగ్

హ్యాపీ ఎండింగ్

బాహుబలి 2 టైటిల్ లోనే ది కంక్లూజన్ అని పెట్టేశారు. బాహుబలి 2 హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది. ఆ తరువాత రాజమౌళి బాహుబలి సీక్వెల్స్ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి 300 కోట్ల భారీ బడ్జెట్ తో రాంచరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు.

నిరాశలేదు

నిరాశలేదు

ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి చిత్రాల్లో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. బాహుబలి మొదటి భాగంలో తమన్నా ఎక్కువ సన్నివేశాల్లో నటించింది. బాహుబలి 3 ప్రారంభం కాకపోవడం తనకు ఎలాంటి నిరాశ లేదని తెలిపింది.

 ప్రారంభమై ఉంటే

ప్రారంభమై ఉంటే

బాహుబలి 3 ప్రారంభమై ఉంటే తమన్నా పాత్ర ఇంకా ఎక్కువగా ఉండేది. కానీ బాహుబలి 2 తోనే రాజమౌళి ముగించేశాడు. బాహుబలి సినిమా ప్రారంభమైనప్పుడు రెండు భాగాలే అనుకున్నారు. బాహుబలి 2 తిరుగులేని విజయం సాధించింది. కాబట్టి బాహుబలి 3 ని కూడా తీసు ప్రేక్షకులపై బలవంతంగా రుద్దడం కరెక్ట్ కాదని తమన్నా అభిప్రాయ పడింది.

సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

జీరో నరసింహారెడ్డి చిత్రంలో నటించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతి పాత్రని అధ్యనం చేసి రూపొందించారు. ఆ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టం అని తమన్నా పేర్కొంది. మెగాస్టార్ సైరాలో తమన్నా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X