డబ్బు కోసమే తమన్నా అలా చేస్తోంది.. ఘాటు విమర్శలపై మిల్కీ బ్యూటీ ఏమందో తెలుసా!
మిల్కీ బ్యూటీ తమన్నాకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందం, అభినయంతో తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అవసరమైనప్పుడు ఈ మిల్కీ బ్యూటీ అందాలు ఆరబోయడానికి కూడా వెనుకాడదు. ఇటీవల వెంకటేష్ సరసన ఎఫ్2 చిత్రంలో నటించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా కొనసాగుతూనే అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తోంది తమన్నా. తమన్నా చేస్తున్న ఐటమ్ సాంగ్స్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మిల్కీ బ్యూటీ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

అవకాశాలు వస్తున్నాయి కదా
సాధారణంగా ఏ హీరోయిన్ అయినా అవకాలు బాగా తగ్గినప్పుడు ప్రత్యేక గీతాల్లో నటించేందుకు మొగ్గు చూపుతారు. కానీ తమన్నాకు తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయినా కూడా తమన్నా తరచుగా ఐటమ్ సాంగ్స్ లో నటించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తమన్నా కేజీఎఫ్ చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ లో నటించింది.

డబ్బు కోసమే
ఇలా హీరోయిన్ గా నటిస్తూ, ప్రత్యేక గీతాలని ఎంచుకోవడంపై చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమన్నా డబ్బు కోసమే ఇలా చేస్తోందంటూ విమర్శిస్తున్నారు. దీనికి తమన్నా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నాకు హీరోయిన్ గా నటిస్తే ఎంత సంతృప్తి దొరుకుతుందో, ప్రత్యేక గీతాల్లో నటిస్తే కూడా అంతే సంతృప్తి ఉంటుంది. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నాని తమన్నా తెలిపింది.

డబ్బే కావాలనుకుంటే
నేను డబ్బు కోసమే ఇలా చేస్తున్నాని అనడం సరైనది కాదు. నాకు డబ్బే ముఖ్యం అనుకుంటే వచ్చిన ప్రతి చిత్రానికి సంతకాలు చేస్తాను కదా అని సమాధానం ఇచ్చింది. హీరోయిన్ గా నటించడం, స్పెషల్ సాంగ్స్ చేయడం రెండూ సినిమాల్లో భాగమే. అందువలన రెండింటిలో నటించడం నాకు సంతోషంగా ఉంటుంది. నా డాన్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. నేను ప్రత్యేక జీతాల్లో నటిస్తే వారందరికీ ఆనందం కలుగుతుంది కదా అని తమన్నా తెలిపింది.

క్రేజీ చిత్రాల్లో
తమన్నా ప్రస్తుతం దట్ ఈజ్ మహాలక్ష్మి, సైరా నరసింహారెడ్డి లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. దట్ ఈజ్ మహాలక్ష్మి చిత్రం హిందీలో ఘనవిజయం సాధించిన కంగనారనౌత్ క్వీన్ చిత్రానికి రీమేక్. కామోషి అనే హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘానా విజయం సాధించిన ఎఫ్2 చిత్రంలో తమన్నా వెంకటేష్ వైఫ్ పాత్రలో నటించింది.


Click it and Unblock the Notifications











