»   » ఫన్ అండ్ ఫ్రస్టేషన్.. వెంకీ హీరోయిన్ ఆమేనా!

ఫన్ అండ్ ఫ్రస్టేషన్.. వెంకీ హీరోయిన్ ఆమేనా!

Subscribe to Filmibeat Telugu

కమర్షియల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్న మరో చిత్రం ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో ఆసక్తికరమైన మల్టీస్టారర్ చిత్రంగా రూపొందనుంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తిసాయి వినోదాత్మక చిత్రంగా మలచనున్నారు. ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ లోగో గత నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకీకి జోడిగా స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసుకోబోతున్నారు.

మిల్కీ బ్యూటీ తమన్నా వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కు హీరోయిన్ గా మెహ్రీన్ ఇప్పటికే ఎంపికైంది. తమన్నా ఈ చిత్రంలోనటించడానికి ఆసక్తి చూపిస్తోందని, కానీ రెమ్యునరేషన్ కి సంబంధించి నిర్మాతలతో ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Tamannaah to romance with Venkatesh in F2

అనిల్ రావిపూడి వరుసగా మూడు విజయాలతో జోరుమీద ఉన్నాడు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలు వరుసగా సూపర్ హిట్లుగా నిలిచాయి. కమర్షియల్ చిత్రాలని తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి తన ప్రత్యేకతని చాటుకుంటున్నాడు.

English summary
Tamannaah to romance with Venkatesh in F2. Anil Ravipudi is the director for this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X