అలాంటి సినిమాలో నటిస్తేనే నా కెరీర్‌కి న్యాయం చేసినట్లు.. తమన్నా సెన్సేషన్

దాదాపు 14 ఏళ్ల క్రిందట సినీ కెరీర్ ప్రారంభించిన తమన్నా.. నేటికీ పాపులర్ హీరోయిన్ల జాబితాలోనే ఉంది. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడినా ఆ తర్వాత నెమ్మదిగా నిలదొక్కుకుంది తమ్మూ. వరుసగా స్టార్ హీరోలందరితో కలిసి నటించి సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకుంది. ఇప్పటి వరకు తన కెరీర్ లో గ్లామర్ పాత్రలు మొదలుకొని అన్నిరకాల రోల్స్ చేసింది ఈ మిల్కీ బ్యూటీ. ఇటీవలే ప్రభుదేవా సరసన అభినేత్రి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇక తమన్నా డాన్సింగ్ పర్‌ఫార్‌మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ టాప్ డాన్సర్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పోటీపడి డాన్స్ చేయగల సత్తా ఉన్న హీరోయిన్ ఈమె మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఆమె డాన్స్ పై తనకున్న ప్రేమను బయటపెట్టింది. ఎప్పటికైనా తన కెరీర్ లో డాన్స్ ఓరియెంటెడ్ సినిమా చేసి తీరుతానని, అలాంటి సినిమా చేస్తేనే తన కెరీర్‌కి న్యాయం చేసినట్లు అవుతుందని ఆసక్తికర విషయం చెప్పింది తమన్నా.

Tamannaah Says About Her Career

అంతేకాదు తాను సినిమాల్లోకి వచ్చి 14 ఏళ్ళు అవుతున్నా ప్రతీ సినిమా తనకు కొత్త అనుభూతినిస్తుందని, ఆ సినిమాతోనే కొత్తగా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టినట్టుగా అనిపిస్తుందని చెప్పింది మిల్కీ బ్యూటీ తమన్నా. బాహుబలి సినిమాతో తన పాపులారిటీ మరింత పెంచుకున్న ఈ భామ.. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో హవా కొనసాగిస్తోంది. మరికొద్ది రోజుల్లో తెలుగులో 'రాజు గారి గది 3' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో షూటింగ్ మొదలు పెట్టుకోనుంది. కాకపోతే ఇందులో నాగార్జున రోల్ ఉంటుందా? లేదా? అనేది మాత్రం క్లారిటీ రాలేదు. దీంతో పాటు మెగాస్టార్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది తమన్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X