Tamannaah Vijay Varma: విజయ్ వర్మలో అది చూసి తమన్నా లవ్‌లో పడిపోయిందట!
హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా వీరి ప్రేమ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ జంట లస్ట్ స్టోరీస్ 2లో కలిసి నటించారు. ఇక ఈ సిరీస్ లో తమన్నా రెచ్చిపోయి నటించింది. ఇదిలా ఉంటే.. విజయ్ వర్మతో తమన్నా ఎందుకు లవ్ లో పడిందో చెప్పేసింది. విజయ్ వర్మలో ఆ క్వాలిటీ చూసి ప్రేమలో పడిందట. ఆ వివరాల్లోకి వెళితే...
ఎన్నో సూపర్ హిట్లు ఖాతాలో...:తమన్నా భాటియా తెలుగులో మంచుమనోజ్ నటించిన శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ఇక ఆ తర్వాత శేఖర్ కమ్ముల కంట పడింది ఈ భామ. ఆయన హ్యాపీడేస్ చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాతో తమన్నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు, స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం లభించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

ప్రేమలో మునిగి తేలుతూ...:ఇక ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఈ భామ ప్రేమలో ఉన్నారు. డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రాగా... గోవా వేదికగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అప్పటి నుంచి వీరు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యే తమ ప్రేమ గురించి తమన్నాతో పాటు విజయ్ వర్మ కూడా కన్ఫామ్ చేశారు. ఇటీవల వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2లో నటించారు. ఇందులో అడల్ట్ సీన్లు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరిచారు.

విజయ్ వర్మపై కామెంట్స్:ఈ సీరిస్ లో తమన్నా ఇంటిమెటెడ్ సీన్స్ ను చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇక విజయ్ తో తమన్నా లిప్ లాక్, అడల్ట్ సీన్లలో నటించింది. ఇక ఆ విషయం పక్కన పెడితే... తమన్నా నటించిన లస్ట్ స్టోరీస్ 2, 'జీ కర్దా వెబ్ సిరీస్ ప్రమోషన్లలో ఆమె పాల్గొంది. ఇక వీటి ప్రమోషన్స్‌లోనే తన ప్రేమ సంగతి బయటపెట్టింది. తాజాగా తన ప్రియుడు విజయ్ వర్మ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనతో ఎందుకు ప్రేమలో పడిందో క్లారిటీ ఇచ్చింది.

అది చూసే ప్రేమలో పడ్డా...:తమన్నా మాట్లాడుతూ... విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తారు. ఇంట్లో స్త్రీలతో పాటు బయటి వారితోనూ ఎంతో గౌరవంతో ఉంటారు. ఇది నేటితరం యువత నేర్చుకోవాలి. స్త్రీలతో ఎలా మెలగాలో తల్లిదండ్రులు వారి కుమారులకు నేర్పాలి. ప్రతి విషయంలోనూ మహిళలు రాజీపడాలనే భావనలను నేను అంగీకరించను. ఇక విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. అందుకే అతను నా మనసుకు దగ్గరయ్యారు. విజయ్ నా జీవితంలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది.. అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











