twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్విట్టర్ రివ్యూ: తమన్నా రొమాంటిక్ 'నెక్స్ట్ ఏంటి'.. ఆడియన్స్ ఏమంటున్నారో తెలుసా!

    |

    మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన నెక్స్ట్ ఏంటి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాస్త ఘాటు రొమాన్స్, ఎంటర్ టైనింగ్ అంశాలతో దర్శకుడు కునాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర టీజర్స్, ట్రైలర్ అన్ని యువతకి ఆకర్షించే విధంగా ఉన్నాయి. తమన్నాకు ఇటీవల సరైన విజయం లేదు. దీనితో నెక్స్ట్ ఏంటి చిత్రంపై ఆశలు పెట్టుకుంది. సందీప్ కిషన్ కు కూడా ఇటీవల సరైన విజయం లేదు. దీనితో ఈ చిత్రం వీరిద్దరికి చాలా కీలకం. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. నేడు నెక్స్ట్ ఏంటి చిత్రం విడుదలైన సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానుల రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం!

    ఫస్టాఫ్ లోనే

    ఇంటర్వెల్ పడగానే థియేటర్ నుంచి బయటకు వచ్చేశా. సినిమా చాలా బోరింగ్ గా ఉంది.

    నచ్చింది కానీ

    నెక్స్ట్ ఏంటి చిత్రాన్ని చాలా నిజాయతీగా తీశారు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పారు. నాకు నచ్చింది. కానీ అందరికి ఈ చిత్రం నచ్చకపోవచ్చు.

    తమన్నా అభిమానులకు మరో నిరాశ

    తమన్నా అభిమానులకు మరో నిరాశ కలిగించే చిత్రం. పాటలు, ట్రైలర్ ద్వారా నాకున్న ఉత్సాహం మొత్తం సినిమా చూసిన తర్వాత నీరుగారిపోయింది.

    బోరింగ్ లవ్ స్టోరీ

    రెండు విభిన్న మనస్తత్వాలు కలిగిన జంట మధ్య జరిగే ప్రేమ కథే నెక్స్ట్ ఏంటి. కానీ చాలా బోరింగ్ గా ఉంది.

    చాలా నెమ్మదిగా

    నెక్స్ట్ ఏంటి చిత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది. ప్రేమ,సెక్స్ అంశాలతో కూడుకున్న రొటీన్ ప్రేమ కథ.

    బాలీవడ్ ఫ్లేవర్

    నెక్స్ట్ ఏంటి చిత్రం బాలీవడ్ ఫ్లేవర్ తో తెరకెక్కించారు. ఇలాంటి చిత్రాలు టాలీవుడ్ కు కూడా అవసరం.

    కొన్ని డైలాగులు, సీన్స్ మాత్రమే

    నెక్స్ట్ ఏంటి చిత్రంలో కొన్ని డైలాగులు, సన్నివేశాలు మాత్రమే బావున్నాయి. సినిమా మొత్తం నిరాశ కలిగించే విధంగా ఉంది.

    తాజాదనం కోసం

    సినిమా స్లోగా సాగినప్పటికీ.. ఈ చిత్రంలో ఉన్న తాజాదనం కోసం ఒకసారి చూడవచ్చు. తమన్నా, సందీప్ కిషన్ నటనలో పరిణితి కనబరిచారు.

    English summary
    Tamannaah, Sundeep Kishan's Next Enti movie Twitter review. Kunal kohli is the director
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X